Site icon Prime9

Mad Square: ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ నుంచి రెండో పాట వచ్చేసింది – స్వాతిరెడ్డి సాంగ్‌ చూశారా?

Swathi Reddy Lyric Song: మ్యాన్‌ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌, సంతోష్‌ శోభన్‌ తమ్ముడు సంగీత్‌ శోభన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్‌’. గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఇంజనీరింగ్‌ కాలేజీ నేపథ్యంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా కామెడీతో కడుపుబ్బా నవ్వించింది ఈ సినిమా. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుని బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు యువతను ఉర్రుతలుగించాయి. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ మ్యాడ్‌ స్క్వేర్‌ వస్తుంది. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి యూత్‌ను ఆకట్టుకునే సాంగ్‌ రిలీజ్‌ చేసింది మూవీ టీం. ఇప్పటి తొలి పాట విడదుల కాగా దానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇప్పుడు ఐటెం సాంగ్‌గా స్వాతిరెడ్డి పాటను విడుదల చేశారు.  ‘నా ముద్దు పేరు పట్టుకున్న స్వాతి రెడ్డి’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. సురేష్‌ గంగుల రాసిని ఈ పాటను భీమ్‌ సిసిరోలి, స్వాతిరెడ్డి యూకే పాడారు. భీమ్ సిసిరోలి సంగీతం అందించిన ఈ పాటకు ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్‌ వస్తుంది. కాగా కళ్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సమర్పణలలో ఆయన సోదరి హారిక, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version