Site icon Prime9

Singer Kalpana: కల్పన సూసైడ్ అటెంప్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన కూతురు

Singer Kalpana: చిత్ర పరిశ్రమ.. బయటకు కనిపించేంత అందమైనది కాదు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పైకి రంగు వేసుకొని నచించేవారైనా.. పాటలు పాడేవారైనా.. కేవలం స్టేజివరకే నవ్వు. బయట వారికి కూడా కుటుంబాలు, సమస్యలు  ఇలా చాలా ఉంటాయి. అయితే ఇండస్ట్రీలో  ఎలాంటి సమస్య వచ్చినా స్ట్రాంగ్ గా నిలబడి ఎదుర్కొనేవారు చాలా తక్కువమంది ఉన్నారు. చిన్న చిన్న వాటికే భయపడి, బాధపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

కల్పన సూసైడ్ అటెంప్ట్..

గతరాత్రి సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్ చేయడం ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆమె ఎక్కువగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెల్సిందే. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కల్పనా గురించి తెలియని సంగీత ప్రేక్షకులు లేరు. ఎన్నో మంచి సాంగ్స్ తో ఆమె ప్రేక్షకులను అలరించింది. అలాంటి కల్పనాకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి.. ? ఎందుకు ఆమె ఇలా చేసింది అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

కూతురు వలనే.. 

సింగర్ కల్పన జీవితం పైకి కనిపించేంత సంతోషంగా అయితే లేదు.  మొదటి భర్త వేధింపులు తట్టుకోలేక విడాకులు ఇచ్చి.. ప్రసాద్ అనే వ్యక్తిని ఆమె రెండో పెళ్లి చేసుకుంది. మొదటి భర్తకు పుట్టిన కూతురు దయ. ఆమె కేరళలో చదువుకుంటుంది. హైదరాబాద్ లో చదువుకోమని కల్పన.. ఎన్నోసార్లు దయను అడిగింది. ఆమె రాను అనడంతో.. మనస్థాపానికి గురై కల్పన నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇక కల్పన స్పృహలోకి వచ్చినప్పుడు పోలీసులు అడిగితే ఆమె కూడా ఇదే కారణం చెప్పిందని అంటున్నారు.

మా అమ్మ ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు – దయ 

తల్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలియడంతోనే దయ వెంటనే హైదరాబాద్ కు చేరుకుంది. తనవలనే తన తల్లి ఆత్మహత్య చేసుకోవాలనుకుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పుకొచ్చింది. ” అమ్మ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. గత కొంతకాలంగా అమ్మ ఇన్సోమ్నియాతో బాధపడుతుంది. వాటికోసం వైద్యులు సూచించిన మందులు వేసుకుంటూ ఉంటుంది. గతరాత్రి మోతాదుకు మించిన మందులు వేసుకోవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.

అంతేకానీ, మా అమ్మ సూసైడ్ చేసుకోవాలనుకోలేదు. దయచేసి తప్పుడు కథనాలను ప్రచారం చేయకండి. మా కుటుంబమంతా సంతోషంగా ఉన్నారు. నా తల్లిదండ్రులు చాలా ఆనందంగా జీవిస్తున్నారు. అమ్మ త్వరగా కోలుకొని త్వరలోనే ఇంటికి వస్తారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version
Skip to toolbar