Last Updated:

Shade Studios: భాగ్యనగరంలో షేడ్ స్టూడియోస్.. కలర్ ఫుల్ గా

సినిమా ఆ మాటే ఓ కలర్ ఫుల్... ప్రేక్షకప్రియులు ఏ సినిమా చూసిన కొత్త అనూభూతిని ఇట్టే పొందుతూ ఉంటారు. సినిమాలో లీనమైయ్యేలా నటీనటుల ప్రాధాన్యత, కధనం, పాటలు, సంగీతం, దర్శకత్వం ఇలా ఎన్నో అంశాలతో ప్రేక్షకులను తన్మయత్వంలో ఉంచేందుకు తెరవెనుక విశ్వ ప్రయత్నమే సాగుతుంది

Shade Studios: భాగ్యనగరంలో షేడ్ స్టూడియోస్.. కలర్ ఫుల్ గా

Prime9Special: సినిమా ఆ మాటే ఓ కలర్ ఫుల్. ప్రేక్షకప్రియులు ఏ సినిమా చూసిన కొత్త అనూభూతిని ఇట్టే పొందుతూ ఉంటారు. సినిమాలో లీనమైయ్యేలా నటీనటుల ప్రాధాన్యత, కధనం, పాటలు, సంగీతం, దర్శకత్వం ఇలా ఎన్నో అంశాలతో ప్రేక్షకులను తన్మయత్వంలో ఉంచేందుకు తెర వెనుక విశ్వ ప్రయత్నమే సాగుతుంది. దాన్నే స్టూడియోగా వ్యాఖ్యానిస్తుంటారు. టేక్, యాక్షన్, కెమరా ఆన్ అనే పదాలే వింటుంటాం. రెండు గంటల సినిమా నిర్మాణంలో ఎలాంటి పనితనంతో, సాంకేతికత, నైపుణ్యత కల్గిన వ్యక్తులు చిత్ర నిర్మాణంలో ఉండేలా తగిన ప్రామాణికాలు పాటిస్తున్న వాటిలో ఒకటై 5వ వసంతంలోకి అడుగెట్టిన శుభ సందర్భంలో షేడ్ స్టేడియోస్ యూనిట్ పై ప్రైం 9 న్యూస్ ప్రత్యేక కధనం.

2018 వ సంవత్సరం నవంబర్ 3న జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 33 లో లెజెండరీ మ్యూజిక్ డైరక్టర్ ఎం.ఎం.కీరవాణి చేతుల మీదుగా షేడ్ స్టూడియోస్ ను దేవి ప్రసాద్ బలివాడ ప్రారంభించారు. ఇందుకు తగిన సహకారాన్ని సంగీత దర్శకులు మధు పొన్నాస్, సౌండ్ ఇంజినీర్ రామ్ గండికోట, సింగర్స్ అనుదీప్, దీపు, హైమత్, లిప్సిక, పృథ్వి చంద్ర, రేవంత్, రోల్ రీడా, ఎం.ఎం.శ్రీలేఖ సహకారాన్ని అందించారు. ప్రముఖ చిత్రాలైన మేజర్, అల వైకుంఠపురంలో (హింది), రౌడీ బాయ్స్, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీర మల్లు లతోపాటు ఎన్నో చిత్రాల పాటలు షేడ్ స్టేడియోలో జీవం పోసుకొన్నాయి.

సోషల్ మీడియాలో విస్తృత శ్రేణిని గుర్తించిన యాజమాన్యం 2019 వ సంవత్సరంలో షేడ్ స్టూడియోస్ అనే యూట్యూబ్ చానల్ ప్రారంభించింది. దీని ద్వారా 200 కు పైగా షార్ట్ అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేసి మంచి మన్నన పొందారు. కరోనా మహమ్మరి సమయంలో కూడా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభ కల్గిన వారిని గుర్తించేందుకు పాటలు, నృత్యాలు, షార్ట్ ఫిల్మ్స్ , లిరిక్స్, డైలాగ్స్ వంటి వాటిపై కాంపిటేషన్సు పెట్టి బహుమతులతో మారుమూల ప్రదేశాల్లోని సృతనాత్మకాన్ని వెలికితీశారు.

2020 సంవత్సరంలో సినిమా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన షేడ్ స్టూడియోస్ నటుడు సునీల్ ముఖ్యపాత్రతో “కనబడుటలేదు” అనే చిత్రాన్ని నిర్మాంచారు. ఆ చిత్ర టీజర్ ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ చేతులమీదుగా రిలీజై నెట్టింట హల్ చల్ చేసి సినిమా అంచనాలను పెంచేలా చేసింది. ఆ చిత్రం నూట యాభై థియేటర్ లలో విడుదలైంది. అమెజాన్ ప్రైం ఓటీటీ లో అందుబాటులో వచ్చింది. దీంతో షేడ్ స్టూడియోస్ లోని పటిష్ట సాంకేతికతకు అద్దం పట్టేలా చేసింది.

కరోనా నేపధ్యంలో డిజిటల్ ప్లాట్ఫామ్స్ కు వీక్షకుల నుండి చాలా ఆదరణ పెరిగింది. అందుకు తగ్గట్టుగా స్టూడియోని 2021 వ సంవత్సరంలో పునరుథ్ధరణ చేశారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి. పట్నాయక్ చేతులు మీదుగా పున:ప్రారంభం చేపట్టారు. రికార్డింగ్, డబ్బింగ్, ఎడిటింగ్, మ్యూజిక్ కంపోసింగ్, మిక్సింగ్, కలర్ డి.ఐ. లాంటి ఎన్నో సదుపాయాలను షేడ్ స్టూడియోస్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. 2021లో లక్ష సబ్స్క్రైబర్స్ కల్గి
యూట్యూబ్ సిల్వర్ బటన్ ని అందుకొని సిని ఇండస్ట్రీలో ప్రత్యేకతను సంపాదించుకొన్నారు.

2022 ఏప్రిల్ 2 వ తేదీన షేడ్ ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్ ను షేడ్ స్టూడియోస్ స్థాపించింది. రెండు వెబ్ ఫిలింస్, ఒక వెబ్ సిరీస్ ఓటీటీ సినిమాలకు తగ్గట్టు చిత్ర నిర్మాణాలను చేపట్టారు. త్వరలో కొన్ని సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు షేడ్ స్టూడియోస్ సిద్ధమైంది. ఇందులో పుష్ప చిత్రంలో కేశవ పాత్ర పోషించిన జగదీష్ ప్రతాప్ బండారి ముఖ్య తారాగణంగా “ఓ కథ”, నూతన నటీనటులతో “టిక్ టాక్ స్టోరీస్”, కేరాఫ్ కంచరపాలెం ఫేం రాజు ముఖ్యపాత్రలో “డి.ఎన్.కె” చిత్రాలు అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.

గడిచిన 4 సంవత్సరాల్లో సంపాదించుకొన్న అనుభవం, కృషితో ప్రస్తుతం షేడ్ స్టూడియోస్ లో 25 సినిమాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సౌండింగ్ విభాగంలొ ఆనంద్ పాల్, వెంకట్ పాటలను రికార్డింగ్ చేస్తున్నారు. డబ్బింగ్ ను సూర్య, సాయి మణిదీప్, బెన్నీ బాబుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఎడిటింగ్ శ్రీకృష్ణ అత్తలూరి, శరత్ జోశ్యభట్ల, విశ్వన్ రాజ్, భాస్కర్, ప్రవీణ్ టాంటాంలు తమ పనితనాన్ని చూపిస్తున్నారు. కలర్ డి.ఐ. లో ప్రవీణ్ కోల, మనోజ్ కుమార్, సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఎం.కె.ఎస్. మనోజ్, సీనియర్ ఎస్.ఎఫ్.ఎక్స్. ఇంజినీర్ వెంకట్ శ్రీకాంత్ గిడుతూరి, మిక్సింగ్ ఇంజినీర్ శ్రీ మిత్ర షేడ్ స్టూడియోలో ప్రతిభను చూపిస్తున్నారు.

ఈ సందర్భంగా షేడ్ స్టూడియోస్ అధిపతి దేవి ప్రసాద్ బలివాడ ప్రైం9న్యూస్ తో మాట్లాడుతూ, తెలుగు చలన చిత్ర నిర్మాణంలో కీలక సేవలను అందిస్తున్నామన్నారు. నిర్మాణ రంగంలో విలువైన ప్రతిభను గుర్తించేందుకు అవకాశం దక్కిందన్నారు. మరోవైపు యూట్యూబ్ ఛానల్ గా సేవలందించడం మిక్కిలి ఆనందం కలుగుతుందన్నారు. షేడ్ స్టూడియో రోజువారీ పనుల్లో భాగంగా శ్రమిస్తున్న మేనేజర్ భాను ప్రసాద్, గణేష్ లకు ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. సాంకేతిక బృందం సహకారం ఇలానే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: Devi Sri Prasad: సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై పోలీసులకు ఫిర్యాదు…కారణం ఏంటంటే?

ఇవి కూడా చదవండి: