Site icon Prime9

Sankranthi Films : సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్లు వచ్చేసాయి..

Sankranthi

Sankranthi

Tollywood News: సంక్రాంతి పండగ సీజన్‌కు ఇంకా 40 రోజుల సమయం మాత్రమే ఉంది. పండగ రేసులో పోటీపడే సినిమాలు దాదాపు కన్ఫర్మ్ అయిపోయాయి. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ కూడ సంక్రాంతికి రావాల్సి ఉండగా జాప్యం కారణంగా వాయిదా పడింది.

సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరువీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి విడుదలవుతన్నాయి. ఈ రెండు స్ట్రెయిట్ చిత్రాలతో పాటు కోలీవుడ్ హీరో విజయ్ యొక్క వరిసు (తెలుగులో వారసుడు) డబ్బింగ్ చిత్రం విడుదలవుతోంది. నిర్మాతలు అన్ని పంపిణీదారులకు విడుదల తేదీల గురించి క్లారిటీ ఇచ్చారు. అన్ని చిత్రాలకు థియేటర్ కేటాయింపు కూడా జరిగిందని తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి థియేటర్లు దక్కుతాయి.

ప్రతి విడుదలకు మధ్య ఒక రోజు గ్యాప్ ప్లాన్ చేసారు మేకర్స్. అజిత్ నటించిన తునివు జనవరి 11న, విజయ్ వారసుడు జనవరి 12న విడుదలవుతాయని సమాచారం. వీరసింహారెడ్డి కూడా అదే తేదీన విడుదల కానుందని తెలుస్తోంది. చిరు యొక్క వాల్తేరు వీరయ్య జనవరి 13 న రానుంది. వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి రెండూ ఒకే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా నిర్మించబడ్డాయి. దీంతో రెండు సినిమాలకు దాదాపు సమాన సంఖ్యలో స్క్రీన్లు వచ్చేలా నిర్మాతలు కసరత్తు చేస్తున్నారు.త్వరలోనే ఈ విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Exit mobile version