Site icon Prime9

Ram Charan: విజయవాడలో 256 అడుగుల రామ్‌ చరణ్‌ భారీ కటౌట్‌ ఏర్పాటు

Ram Charan 256 Feet Cutout: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ జనవరి 10న విడుదలకు సిద్దమవుతుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో చరణ్‌ నటించని చిత్రమిది. దాదాపు ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌తో సింగిల్‌ వస్తున్నాడు. దీంతో చిత్రంపై అంచనాలు భారీ నెలకొన్నాయి. ఇక మూవీ రిలీజ్‌ టైం దగ్గర పడుతుండటంతో చిత్రం బృందం ప్రమోషన్స్‌ జోరు పెంచింది.

అయితే ఈ సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మెగా అభిమానులు రామ్‌ చరణ్‌ భారీ కటౌట్‌ని ఏర్పాటు చేశారు. విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో ఈ భారీ కటౌట్‌ను ఇవాళ (డిసెంబర్‌ 29) ఆవిష్కరించనున్నారు. రామ్‌ చరణ్‌ అభిమాన సంఘం యువశక్తి అధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. 256 అడుగుల రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ లుక్‌కి సంబంధించిన భారీ కంటౌట్‌ ఏర్పాటు చేశారు.

ఇంత భారీ కటౌట్‌ పెట్టడం ఇదే తొసలారి అని, ఇది తమకేంతో ప్రత్యేకమని అభిమానులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ భారీ కటౌట్‌ నేషనల్‌ వైడ్‌గా హాట్‌టాపిక్‌ మారింది. వారం రోజుల పాటు శ్రీమించి ఈ కటౌట్‌ని తయారు చేశారు. ఇందుకోసం చెన్నై నుంచి ప్రత్యేక బృందాలుతో ఈ కటౌట్‌ని ప్రత్యేకంగా నిర్మించినట్టు యువశక్తి టీం పేర్కొంది. ఈ కటౌట్‌ ఆవిష్కరణ సందర్భంగా ఆదివారం సాయంత్రం మైదానంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మూవీ టీం పలువురు పాల్గొననున్నారు.

కాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్, థ్రిల్లర్ డ్రామా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతుంది. రామ్ చరణ్ డ్యుమెల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో  హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా.. తెలుగమ్మాయి అంజలి మరో ఫీమేల్ లీడ్ రోల్లో కనిపించనుంది. తమిళ నటుడు ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని, జయరాం, నాజర్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు. తమన్ ఈ సినిమా సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version