Site icon Prime9

SSMB29: మహేష్‌-రాజమౌళి చిత్రంలో ‘సలార్‌’ నటుడు! – ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌

Pruthviraj Sukumar Post Viral: సలార్‌ నటుడు, మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకి ఆయన పోస్ట్‌ అర్థమేంటీ అని సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ అంతా తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకి ఆ పోస్ట్‌ ఏంటంటే.. ప్రస్తుతం రాజమౌళి, మహేష్‌ బాబు కాంబో ఓ భారీ ప్రాజెక్ట్‌ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబీ29(SSMB29) అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గుట్టుచప్పుడు కాకుండా సినిమా గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ఇక విదేశాల్లో సైలెంట్‌గా షూటింగ్‌ కానిచ్చేస్తున్నారు. పాన్‌ వరల్డ్‌గా తెరకెక్కబోతోన్న ఈ సినిమాలో హాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలివుడ్‌కు చెందిన స్టార్స్‌ కూడా భాగం అవుతున్నట్టు తెలుస్తోంది.

జాన్ అబ్రహాంతో చర్చలు..

ఇప్పటికే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహంతో మూవీ టీం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మలయాళ స్టార్‌ హీరో, సలార్‌ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నట్టు ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. ఇదే విషయాన్ని ఓ ఇంటర్య్వూలో ఆయననే స్వయంగా ప్రశ్నించగా.. అవును, కాదు అన్నట్టుగా స్పందించారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఫైనల్‌ కాలేదని చెప్పి తప్పించుకున్నారు. అయితే, కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. దీంతో SSMB29లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడని అంతా ఫిక్స్‌ అయ్యారు.

లెన్తీ డైలాగ్స్.. భయంగా ఉంది

తాజాగా ఆయన దర్శకత్వంతో మోహన్‌ లాల్‌ హీరోగా ఎల్‌2 మూవీ తెరకెక్కింది. మార్చి 27న ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నిర్మాణాంతర పనులు కూడా పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని ఆయన చెబుతూ .. “దర్శకుడిగా నా పని పూర్తి చేశాను. సినిమాకు సంబంధించిన బాధ్యతలు, మార్కెటింగ్‌ పనులన్ని పూర్తి చేసి హ్యాండోవర్‌ చేశాను. ఇక నటుడిగా నాది కాని భాషలో బహురూపాల్లో ఏకపాత్రాభినయం చేయబోతున్నా. అయితే ఇందులో పెద్ద పెద్ద డైలాగ్స్‌ ఉన్నాయని తెలిసి కాస్తా నర్వస్‌గా ఉంది” అని రాసుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్ SSMB29కి సంబంధించే అయి ఉంటుందని అంతా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ని మొదలెట్టింది. పృథ్వీరాజ్ ఇందులో నటిస్తున్నట్టు ముందు నుంచి గట్టి ప్రచారం నడుస్తోంది.

ఇటీవల మూవీ సెట్స్‌పైకి వచ్చింది. ఇదే సమయంలో ఆయన ఇలా అర్ధం కానీ రీతిలో పోస్ట్‌ చేసి అందరిలో క్యూరియాసిటి పెంచారు. ఆయన చెప్పింది SSMB29 మూవీ గురించే అయ్యింటుందని నెటిజన్లంతా అభిప్రాయపడుతున్నారు. అదే నిజం అయితే మాత్రం ఇటూ మహేష, అటూ పృథ్వీరాజ్ ఫ్యాన్స్‌కి పండగే. ఇప్పటికే సలార్‌తో తెలుగులో ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్నారు ఆయన. ఇప్పుడ పాన్‌ ఇండియాతో చిత్రంతో ఇంటర్నేషనల్‌ స్థాయిలో గుర్తింపు పొందబోతున్నారు. ఇక SSMB29కి మూవీ కథ విషయానికి వస్తే.. ఇదోక యాక్షన్‌, అడ్వెంచర్‌ మూవీ అని, అమెజాన్‌ అడవి చూట్టు ఈ మూవీ కథ సాగుతుందని ఇప్పటికే జక్కన్న హింట్‌ ఇచ్చేసాడు. జేమ్స్‌ బాండ్‌ తరహాలో ఈ సినిమాను పాన్‌ వరల్డ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్నట్టు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar