Last Updated:

Priyamani: అంత ద్వేషం ఎందుకు?, పుట్టబోయే పిల్లలను కూడా వదలడం లేదు.. ట్రోల్స్‌పై ప్రియమణి ఆవేదన

Priyamani: అంత ద్వేషం ఎందుకు?, పుట్టబోయే పిల్లలను కూడా వదలడం లేదు.. ట్రోల్స్‌పై ప్రియమణి ఆవేదన

Priyamani About Online Hate After Interfaith Wedding: నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్‌ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు పొందింది. నాలుగు పదుల వయసులోనూ యంగ్‌ హీరోయిన్లకు పోటీగా గ్లామర్‌ను మెయింటైన్‌ చేస్తోంది. ప్రస్తుతం ఉమెన్‌ ఒరియంటెడ్‌, భారీ చిత్రాల్లో కీలక పాత్రలు అందుకుంటోంది. ప్రస్తుతం బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ కెరీర్‌ పరంగా ఫుల్‌ బిజీగా ఉంటోంది.

ఈ క్రమంలో ఆమె ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తాను విమర్శలకు ఎదుర్కొంటున్నానని, తనకు పుట్టబోయే పిల్లలను కూడా వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రియమణి 2017లో ముస్తాఫారాజ్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2016లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదిక పంచుకుంది. అప్పటి నుంచి తనకు వస్తున్న వ్యతిరేకత గురించి చెబుతూ ప్రియమణి అసహనం వ్యక్తం చేసింది.

ఈ మేరకు ప్రియమణి మాట్లాడుతూ.. “నా భర్త ముస్తాఫారాజ్‌ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. నాకు సంబంధించిన ఒక శుభవార్తను (ఎంగేజ్‌మెంట్‌) ఓ రోజు సోషల్‌ మీడియాలో పంచుకున్నాను. ఇది విని అంతా ఆనందిస్తారని అనుకున్నా. కానీ, దానికి భిన్నమైన స్పందనలు వచ్చాయి. నాపై అనవసరమైన ద్వేషం ప్రారంభమైంది. లవ్‌ జీహాద్‌ ఆరోపణలు చేశారు. పెళ్లి తర్వాత మతం మార్పిడి ఒత్తిడి చేస్తాడంటూ వ్యతిరేకమైన కామెంట్స్‌ వచ్చాయి.

ఆఖరికి పుట్టబోయే పిల్లలను కూడా వదలలేదు. పుట్టిన పిల్లలు ఐసిస్‌లో చేరతారంటూ విపరీతమైన ద్వేషం చూపిస్తున్నారు. అలాంటి కామెంట్స్‌ నన్ను చాలా బాధిస్తున్నాయి. నేను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని కాబట్టి అలాంటి వాటిని పట్టించుకోను. కానీ, నా భర్తపై అలాంటి కామెంట్స్‌ ఎందుకు చేస్తున్నారు. ఆయన గురించి ఏం తెలుసని అంటున్నారు. ఇప్పటికీ నేను, నా భర్త దిగిన ఫోటోలు షేర్‌ చేస్తే అందులో చాలా కామెంట్స్‌ మా పెళ్లికి సంబంధించినవే ఉంటాయి” అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ చిత్రంతో అలరించిన ప్రియమణి ప్రస్తుతం దళపతి విజయ్‌ నటిస్తున్న జననాయగన్‌లో చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.