Site icon Prime9

HIT 3 Teaser: నాని ఊచకోత.. హిట్ 3 టీజర్ ఎలా ఉందంటే?

Nani HIT 3 Teaser Released: నేచురల్ స్టార్ నాని, శైలేశ్ కొలను డైరెక్షన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’. నాని బర్త్ డే సందర్బంగా సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. తాజాగా, ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో నాని ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అర్జున్ సర్కార్‌గా నటిస్తున్నారు.

టీజర్‌ విషయానికొస్తే.. శ్రీనగర్ ప్రాంతంలో ఈ స్టోరీ ఉన్నట్లు తెలుస్తోందది. అలాగే టీజర్‌లో బీజీఎం, డైలాగ్స్, నాని యాక్టింగ్ ఓ లెవల్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో జరిగే వరుస హత్యలను అర్జున్ సర్కార్ ఎలా చేధించాడనే కోణంలో సాగగా.. వయోలెన్స్ చాలా ఆకట్టుకుంటున్నాయి. ఇక, నాని ఇందులో ఊచకోత బయటపడింది. ఒక్కసారిగా డిఫరెంట్ రోల్‌లో అందరినీ భయపెట్టాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీ మే 1వ తేదీన విడుదల కానుంది.

ఈ టీజర్‌ను చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. లవర్ బాయ్‌గా ఆకట్టుకునే నాని గేర్ మార్చారని కొంతమంది కామెంట్స్ చేయగా.. ‘సరిపోదా శనివారం’తో యాక్షన్‌కు పెద్ద పీట వేశారన్నారు. అలాగే ఈ సినిమాలో నాని ఊచకోత మామూలుగా లేదని కామెంట్స్ చేస్తున్నారు. పోలీస్ రోల్‌లో రక్తపాతం సృష్టించారని చెబుతున్నారు.

Exit mobile version
Skip to toolbar