Allu Arjun Bail Petition: సినీ నటుడు అల్లు అర్జున్ పిటిషన్ తీర్పు నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఆయన బెయిల్ ఇవ్వోద్దని చిక్కడపల్లి పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు బెయిల్ ఇవ్వాల్సిందిగా తమ వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పు జనవరి 3కి వాయిదా వేసింది. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టై జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. హైకోర్టులో క్యాష్ ఫిటిషన్ వేసి మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు.
అయితే రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పటిషన్ వేయాలని హైకోర్టు ఇచ్చిన సూచన మేరకు గతవారం అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణను కోర్టు డిసెంబర్ 30కి వాయిదా వేసింది. ఈ క్రమంలో ఇవాళ అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగగా.. అల్లు అర్జున్‌కు బెయిల్ ఇవ్వోద్దని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. అతడికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ బన్నీ తరుప లాయర్లు తమ వాదనలు వినిపించారు.
ఈ వాదనల సందర్భంగా పలు అంశాలను అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సంధ్య థియేటర్ ఘటనకు, అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. రేవతి మృతికి ఆయన కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు బీఎన్‌ఎస్ సెక్షన్ 105 ఆయనకు వర్తించదని రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఇటూ అల్లు అర్జున్‌కి బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. దీంతో ఇరు వాదనలు విన్న కోర్టు తీర్పును జనవరి 3కు వాయిదా వేసింది.
కాగా ‘పుష్ప 2’ రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో బెనిఫిట్, ప్రీమియర్లు వేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సినిమా చూసేందుకు సంధ్య థియేటర్‌కు వెళ్లారు. ఆయనన చూసేందుకు జనం ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. ఇటీవల బన్నీని అరెస్ట్ చేసిన నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిఇమాండ్ విధించింది కోర్టు. దీంతో అల్లు అర్జున్ హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేసి నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టు పిటిషన్ వేయగా కోర్డు నేడ విచారణ చేపట్టింది.