Site icon Prime9

Oru Jaathi Jathakam: మలయాళ మూవీకి ఎదురుదెబ్బ – ఆ దేశాల్లో ఒరు జాతి జాతకంపై బ్యాన్‌

Oru Jaathi Jaathakam faces ban in Gulf countries: రిలీజ్‌కు ఇంకా కొన్ని గంటలు ఉందనగా ఓ సినిమాపై బ్యాన్‌ విధించారు. నేడు శుక్రవారం థియేటర్‌లో విడుదల కావాల్సిన ఆ చిత్రాన్ని నిలిపివేయడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకి అదే ఏ మూవీ అంటే ‘ఒరు జాతి జాతకం’. ఎం. మోహనన్ దర్శకత్వంలో రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్‌ జవనరి 31న విడుదలకు సిద్దమైంది. అలాగే గల్ఫ్ దేశాల్లోనూ ఈ సినిమా రిలీజ్‌ చేసేందుకు మూవీ టీం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే మలయాళ స్టార్‌ హీరోలు, ప్రముఖ నటుల చిత్రాలు గల్ఫ్‌ దేశంలోనూ రిలీజ్‌ అవుతాయనే విషయం తెలిసిందే.

అలాగే ఒరు జాతి జాతకం సినిమాను గల్ప్‌ దేశాల్లో భారీ ఎత్తున రిలీజ్‌కు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఇవాళ జవనరి 31న ఈ సినిమా భారత్‌తో పాటు గల్ఫ్‌ దేశాల్లోనూ విడుదల కావాల్సి ఉంది. అయితే సడెన్‌గా అక్కడ ఈ మూవీ రిలీజ్‌ని నిలిపివేసి బ్యాన్‌ విధించారు. LGBTQ+ కమ్యునిటీకి సంబంధించి సన్నివేశాలు ఉండటం వల్లే మూవీని బ్యాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఆ కారణం చేత ఓమన్‌ దేశం మినహా మిగతా గల్ఫ్‌ దేశాల్లో ఆ సినిమాపై బ్యాన్‌ విధించడంతో మూవీ టీంకి గట్టి దెబ్బ తగిలినట్టు అయ్యింది. అయితే గల్ఫ్‌ దేశాల్లో మలయాళ సినిమాలకు ఇలాంటి అనుభవాలు ఎదురవ్వడం కొత్తేమి కాదు.

గతంలో మోహన్‌ లాల్‌ వంటి స్టార్‌ హీరోల సినిమాలకు సైతం గల్ఫ్‌ దేశాల్లో బ్యాన్‌ను ఎదుర్కొన్నాయి. అయితే మూవీపై బ్యాన్‌ విధించేంతగా ఆ సినిమాలో ఏముందంటే.. ఈ సినిమా మొత్తం జాతకాల చూట్టు తిరిగే మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో జయేష్‌కి పెద్దగా ఏది కలిసిరాదు. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంటాడు. అయితే పెళ్లి చూపులకు వెళ్లిన ప్రతి చోట అతడు రిజెక్షన్‌ని ఎదుర్కొంటాడు. దీనికి కారణం అతడు హోమో సెక్సువల్ జెండర్‌ అనే ప్రచారం ఉంటుంది. దీనిపై అతడిని అంతా ఎగతాళి చేస్తుంటారు. నిజానికి జయేష్‌ అలాంటి వాడు కాకపోయిన తనపై వచ్చిన ఈ రూమర్‌ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటాడు.

అదే సమయంలో జయేష్‌ జాతకం చెప్పడంలో సిద్ధహత్తురాలైన ఆ మహిళను కలుసుకున్న తర్వాత అతడి జీవితం ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. అయితే తనపై పడిన ఆ నిందను అబద్దమని ఎలా ప్రూవ్‌ చేసుకున్నాడనేది సనిమా చూసి తెలుసుకోవాల్సిందే. నిఖిలా విమల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా గతేడాది ఆగష్టు 22న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ వాయిదా పడింది. ఆ తర్వాత అడ్డంకులను ఎదుర్కొని ఎట్టకేలకు ఈ చిత్రం శుక్రవారం (జనవరి 31) థియేటర్‌లోకి వచ్చింది.

Exit mobile version
Skip to toolbar