Site icon Prime9

Jr NTR: లండన్‌ వెకేషన్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ – పిల్లలతో ఎలా ఎంజాయ్‌ చేస్తున్నాడో చూడండి!

Jr NTR Enjoying Holiday With Family: ఈ ఏడాది దేవర మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు జూనియర్‌ ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన వార్‌ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అలాగే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రాబోయే NTR31 మూవీకి సిద్ధమవుతున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమంతో లాంచ్‌ అయిన ఈ సినిమా 2025 ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం రెడీ అవుతున్న ఆయన కాస్తా విరామం తీసుకుని ఆ సమయాన్ని ఫ్యామిలీ కేటాయిస్తున్నాడు.

ఇందుకోసం భార్య ప్రణతి, ఇద్దరు కుమారులతో కలిసి వెకేషన్‌ వెళ్లాడు. ప్రస్తుతం లండన్‌లో ఆయన సందడి చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో తారక్‌ తన పిల్లలతో కలిసి చిల్‌ అవుతున్నారు. లండన్‌లోని హైడ్ పార్క్‌లో తన పిల్లలతో కలిసి చిల్‌ అవుతూ కనిపించాడు.

కాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన దేవర మూవీ సెప్టెంబర్‌ 27 వరల్డ్‌ వైడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోస్టల్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక దీనికి పార్ట్‌ 2 కూడా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల ఈ మూవీ స్క్రిప్ట్‌, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌తో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా కూడా రెగ్యూలర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. బాలీవుడ్‌ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతి కథానాయకుడిగా కనిపించాడు.

Exit mobile version