Allu Arjun Special Training: ‘పుష్ప 2’ రిలీజై రెండు నెలలు అయిపోయింది. ఇంకా అల్లు అర్జున్ నుంచి కొత్త సినిమా ప్రకటన రావడం లేదు. అభిమానులంతా బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇంకా అల్లు అర్జున్ నుంచి ఎలాంటి కబురు లేదు. . గత ఐదేళ్లుగా అల్లు అర్జున్ పుష్ప చిత్రంతోనే బిజీగా ఉన్నాడు. దీంతో ఏడాదికి ఒక్క సినిమా అయిన చేసే బన్నీ.. ఐదేళ్లు పుష్ప 1, పుష్ప 2 చిత్రాలు మాత్రమే రిలీజ్ చేశాడు. పుష్ప 2 షూటింగ్ దశలోనే ఉండగా.. ఆయన అప్‌కమ్మింగ్ సినిమాల గురించి రకరకాలు వార్తలు వచ్చాయి.
అట్లీ? త్రివిక్రమ్?
సందీప్ రెడ్డి వంగా, తమిళ డైరక్టర్ అట్లీ, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను లైన్లో పెట్టాడంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇందులో త్రివిక్రమ్‌తో మూవీ మాత్రం ఫిక్స్. ఇక సందీప్ రెడ్డి వంగాతో సినిమా లేదని స్పష్టమైంది. అప్పట్లో అట్లీతో సినిమా కూడా లేదన్నారు. కానీ, ప్రస్తుతం అట్లీ-బన్నీ ప్రాజెక్ట్‌కి కూడా కన్‌ఫాం అనే వార్తలు వచ్చాయి. పుష్ప 2 రిలీజ్ తర్వాత వెంటనే త్రివిక్రమ్ లేదా అట్లీతో సినిమాని ప్రకటిస్తాడని అంతా వెయిట్ చేస్తున్నారు. కానీ, బన్నీ మాత్రం విదేశి పర్యటనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన తీరు చూస్తోంటే ఇప్పట్లో కొత్త సినిమా ప్రకటన వచ్చేలా కనిపించడం లేదనిపిస్తోంది.
విదేశాల్లో స్పెషల్ ట్రెయినింగ్
ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఛావా తెలుగు రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చాడు. బన్నీ వాసు, అల్లు అర్జున్‌లు మంచి స్నేహితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ విలేఖరి.. బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పమనగా.. బన్నీవాసు నుంచి సరైన సమాధానం మాత్రం రాలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఓ స్పెషల్ ట్రెయినింగ్‌లో ఉన్నాడని చెప్పారు. ఇది తన పర్సనల్ ట్రెయినింగ్ అని స్పష్టం చేశారు. దీంతో అందరి దృష్టి బన్నీ స్పెషల్ ట్రైయినింగ్‌పై పడింది. దీంతో అంతా ఖచ్చితంగా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసమే అయ్యింటుందని అంతా అభిప్రాయపడుతున్నారు.
ఇది ఓ మైథాలజికల్ డ్రామాగా పాన్ ఇండియాగా వస్తుందని ముందు నుంచి ప్రచారం ఉంది. ఈ సినిమా కోసమే అల్లు అర్జున్ మేకోవర్ అయితున్నాడా? అని సందేహిస్తున్నారు. అంటే సైలెంట్ త్రివిక్రమ్-అల్లు అర్జున్‌ల ప్రాజెక్ట్ మొదలైనట్టే? అనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. అంటే అట్లీతో కంటే ముందు త్రివిక్రమ్‌తోనే సినిమా ఉండబోతుందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే బన్నీ వాసు ఇది అల్లు అర్జున్ పర్సనల్ ట్రెయినింగ్ అని చెప్పారు. బన్నీ నటనలో కొత్త పద్దతులను అనుసరిస్తుంటాడని, ఇందులో తరచూ రిసెర్చ్ చేస్తుంటాడన్నారు. ఇందులో భాగంగానే స్పెషల్ ట్రెయినింగ్ కోసం విదేశాలకు వెళ్లినట్టు చెప్పడంతో త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన గుసగులస వినిపిస్తున్నాయి.