Last Updated:

HIT-2 Trailer: ఆకట్టుకుంటున్న హిట్-2 ట్రైలర్.. అంచనాలు పెంచేస్తున్న కేడీ

అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలయ్యింది. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఆ టీజర్ ఎలా ఉందో చూద్దాం.

HIT-2 Trailer: ఆకట్టుకుంటున్న హిట్-2 ట్రైలర్.. అంచనాలు పెంచేస్తున్న కేడీ

HIT-2 Trailer: అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలయ్యింది. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఆ టీజర్ ఎలా ఉందో చూద్దాం.

గత ఏడాది విశ్వక్ సేన్, రీతు వర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన హిట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా నాని సమర్పణలో ఆయన సోదరి త్రిపురనేని ప్రశాంతి నిర్మించారు. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న హిట్-2 చిత్రంలో అడివి శేష్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. రావు రమేష్, భానుచందర్, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి వంటి ప్రముఖ తారాగణం అంతా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

డిసెంబర్ రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇక ఈ సినిమా టీజర్ మాత్రం ఆద్యంతం ఉత్కంఠతతో ఆకట్టుకునే విధంగా ఉంది. విశాఖపట్నంలో పని చేసే ఒక పోలీసు అధికారిగా అడవి శేష్ కేడీ అనే పాత్రలో కనిపిసున్నారు. ఒక క్రైం కేసులో రంగంలోకి దిగిన కేడీ ఆ కేసును ఏవిధంగా పరిష్కరిస్తారు ఏఏ కోణాలలో ఈ చిత్రం మలుపుతిరుగనుంది అనేది ఈ చిత్రం చూస్తే కానీ చెప్పలేము. ఇకపోతే ఈ చిత్రంలో రావు రమేష్ డీజీపీ పాత్రలో కనిపిస్తుండగా సినిమా అంతా విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో సాగనున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: విజువల్ వండర్ గా “అవతార్ ది వే ఆఫ్ వాటర్” ట్రైలర్

ఇవి కూడా చదవండి: