Last Updated:

Guppedantha Manasu: జగతి నగలతో ముడిపడిన రహస్యం… రిషిని చూసి బయపడిన దేవయాని ఎందుకంటే..?

గుప్పెడంత మనసు బుల్లితెర ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్. మరి ఈ సీరియల్ సెప్టెంబర్ 14 హైలెట్స్ ఏంటి... రిషీ ఇచ్చిన చీర వసూకు నచ్చుతుందా.. దేవయాని జగతి నగలు ఇచ్చేందుకు ఎందుకు బయపడుతుంది అనే సంఘటనలను ఈ ఎపిసోడ్లో చూద్దాం.

Guppedantha Manasu: జగతి నగలతో ముడిపడిన రహస్యం… రిషిని చూసి బయపడిన దేవయాని ఎందుకంటే..?

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు డైలీ సీరియల్ ప్రేక్షకుల ఆదరాభిమానాలు కొల్లగొట్టింది. రిషీ వసూల పాత్రలైతే ప్రతి తెలుగుంటివారికి తెగనచ్చేశాయనుకోండి. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య ఓ అందమైన ప్రేమ కథతో నాటిక కొనసాగుతుంది. మరి ఈ సీరియల్ ఈరోజు అనగా సెప్టెంబర్ 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం…

రిషీ వసూల అందమైన ప్రేమకథే గుప్పెడంత మనసు సీరియల్. మరి ఈ రోజు ఈ సీరియల్ ప్రారంభమవ్వగానే… రిషి, జగతి ఒక జట్టు.. వసుధార, మహేంద్ర ఒక జట్టుగా క్యారమ్స్ ఆడుతారు. కాగా చివరికి జగతి చేతిలో ఆట ఉంటుంది. దానితో గెలుపు ఓటములు నిర్ణయం అవుతాయి. కాగా జగతి బయపడుతూ ఉంటుంది. తప్పుడు కాయిన్ కొడితే వసూ వాళ్లు గెలిచి రిషీ బాధపడుతారేమో అని టెన్షన్ ఫీల్ అవుతుంది. దానికి రిషీ పర్లేదు మేడం నాకు మీ మీద నమ్మకం ఉంది ఆడండి. మనం గెలుస్తాము అని ప్రోత్సాహం ఇస్తాడు. అప్పుడు జగతి భయపడుతూనే సరైన కాయిన్ కొడుతుంది. దానితో రిషీ జగతి టీం గెలుస్తారు. అప్పుడే అక్కడి వచ్చిన దేవయాని అది ఆశ్చర్య పోతుంది.

ఆ తర్వాత సీన్లో దేవయాని భర్త, దేవయాని వద్ద కు వచ్చి… జగతి నగలు మన దగ్గర ఉండిపోయాయి కదా అవి ఇవ్వడానికి ఇదే మంచి సమయం అంటూ తనకి ఇవ్వమని చెప్తాడు. దేవయాని ఆ నగలు బయటకు తీస్తున్న సమయంలో రిషి అక్కడికి వచ్చి ఈ నగలు ఎవరివి పెద్దమ్మ అని అడుగుతాడు. నగలు ఎవరివో తెలిస్తే నాకు గుట్టు బయట పడుతుందని గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తు తెచ్చుకుంటుంది దేవయాని. రిషి చిన్నప్పుడు దేవయాని జగతిని బలవంతంగా బయటకు పంపించేసి రిషి దగ్గరికి వెళ్లి, మీ అమ్మ డబ్బులు, తన నగలు తీసుకొని వెళ్ళిపోయింది నీకు జ్వరంగా ఉన్నదని చెప్పినా వినలేదు అని రిషికి మాయమాటలు చెప్తుంది. ఈ సంఘటన గుర్తు తెచ్చుకున్న దేవయాని ఇప్పుడు ఈ నగలు జగతివని తెలిస్తే రిషికి నా మీద అనుమానం వస్తుంది అని భయపడి, ఇవి నావే రిషి జగతి పెళ్లిరోజు కదా అని పెదనాన్న బహుమతిగా ఇవ్వమన్నారు అని అంటాది. అప్పుడు రిషి గతంలో జరిగిన చిన్ననాటి సంఘటన గుర్తు తెచ్చుకుని ఆలోచనలో పడతాడు. అదే టైంలో అక్కడి వచ్చిన గౌతమ్ రిషిని చూసి ఏం అయ్యిందని అడుగుతాడు. దానికి రిషీ చిన్నప్పుడు నుంచి డాడీనే నాకు అమ్మానాన్న అయ్యారు. ఇన్ని ఏళ్ల తర్వాత మళ్లీ డాడ్ మొఖంలో ఆనందాన్ని చూస్తున్నాను అని అంటాడు. దానికి గౌతమ్, జరిగిందంతా గుర్తు తెచ్చుకోవడం ఎందుకు, ఇప్పుడు వాళ్ళిద్దరూ బానే ఉన్నారు కదా మనం వాళ్ళ పెళ్లిరోజు కూడా జరుపుకుంటున్నాము ఇంక అన్ని ఆలోచనలు వదిలే అని అంటాడు.

సీన్ కట్ చేస్తే వసు మంచం నిండా తన బట్టల్ని పేర్చి, ఏ బట్టలు వేసుకోవాలి… రిషి సార్ నన్ను చూడగానే ఆశ్చర్యపోవాలి అని అనుకుంటుంది. అంతలో రిషి అక్కడికి వస్తాడు ఏం చేస్తున్నావని అడుగుతాడు. దానికి వసూ బట్టలు ఎన్నుకుంటున్నాను సార్ మీరు కాస్త సలహా ఇవ్వొచ్చు కదా అని అంటుంది. అంతలో రిషి, వసుదార కి చీర గిఫ్ట్ ఇస్తాడు. ఈ చీర కట్టుకో వసుధార నాకు ఈ రంగు బాగా నచ్చింది నీకు చాలా బాగుంటుంది అని అంటాడు.

ఆ తర్వాత సీన్లో జగతి తన గదిలో ఉండగా దేవయాని అక్కడికి వచ్చి నగలు ఇచి మీ పెళ్లి రోజు అని మీ బావగారు ఈ నగల్ని నీకు ఇవ్వమన్నారు అని అంటుంది. మీరు నన్ను ఇంతలా ఆదరించారు నాకు అదే చాలు అక్కయ్య నాకు ఇది వద్దు అని జగతి అనగా.. నిన్ను ఇంటి కోడలి హోదాలో మీ బావగారు చూడాలి అని ఆశపడ్డారు. నేను తిరిగి వెళ్లి జగతి కి ఇష్టం లేదు అని చెప్పనా అని అంటుంది. దానికి జగతి వద్దు అక్కయ్య అంత పని చేయకండి. మీరు ఇంత ప్రేమగా ఇస్తే కాదంటానా అని నగలు తీసుకుంటుంది.
ఇంటి కోడలు హోదా లో నా గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు అక్కయ్య అనీ జగతి అనగా.. నేను కేవలం నీ గురించి మాత్రమే ఆలోచిస్తాను జగతి అని దేవయాని ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

ఇదీ చూడండి: Karthika deepam: సెప్టెంబర్ 14 మోనిత ఆడిన డ్రామా వల్ల సీరియల్ కొత్త మలుపు తిరగబోతుంది!

ఇవి కూడా చదవండి: