Site icon Prime9

Game Changer: గేమ్‌ ఛేంజర్‌పై చిరంజీవి ఫస్ట్‌ రివ్యూ – ఏమన్నారంటే!

Chiranjeevi Review on Game Changer: మరికొన్ని రోజుల్లో ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ థియేటర్‌లోకి రానుంది. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా డైరక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్‌ మూవీపై మంచి హైప్‌ క్రియేట్‌ చేశాయి. ఆరేళ్ల తర్వాత రామ్‌ చరణ్‌ సోలో హీరోగా వస్తున్న చిత్రం కావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్లో స్లోగా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు 2025 జనవి 10న విడుదలకు సిద్ధమవుతంది.

ఇక సినిమా రిలీజ్‌కు ఇంకా పది రోజులే ఉండటంతో అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇక సినిమా ఫైనల్‌ అవుట్‌ పుట్‌ చూసిన మెగాస్టార్‌ చిరంజీవి గేమ్‌ ఛేంజర్‌పై ఫస్ట్‌ రివ్యూ ఇచ్చారు. గేమ్‌ ఛేంజర్‌ చూసిన ఆయన ఏమన్నారనేది దిల్‌ రాజు విజయవాడ ఈవెంట్‌లో చెప్పారు. గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్‌ సందర్భంగా రామ్‌ చరణ్‌ యువశక్తి అభిమానులు విజయవాడలో భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌ ఆవిష్కరణకు దిల్‌ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గేమ్‌ ఛేంజర్‌ ట్రైలర్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి గేమ్‌ ఛేంజర్‌ మూవీ చూసినట్టు చెప్పారు.

“నేను విజయవాడ వచ్చే ముందు చిరంజీవి గారికి ఫోన్‌ చేశాను. కొన్ని రోజుల క్రితం ఫస్టాఫ్‌ చూసిన ఆయన తాజాగా ఫైనల్‌ అవుట్‌ పుట్‌ చూశారు. నేను ఫోన్‌ చేసి ఆయనను సినిమా చూడమని అడిగాను. ఆయనతో పాటు మరికొందరు సినిమా చూడటం మొదలు పెట్టారు. ఇక విజయవాడకు చేరుకునే సమయానికి ఆయన నాకు ఫోన్‌ చేశారు. ఈ సంక్రాంతికి మామూలుగా కొట్టడం లేదని అభిమానులకు చెప్పండి’ అని చిరంజీవి నాతో అన్నారు. నాలుగేళ్ల క్రితం డైరెక్టర్‌ శంకర్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఏలా ఫీలయ్యానో.. చిరంజీవి గారు ఒక్కో సన్నివేశం గురించి చెబుతుంటే అదే ఫీలయ్యాను. చాలా సంతోషంగా అనిపించింది” అని దిల్‌ రాజు చెప్పుకొచ్చారు. ఆయన కామెంట్స్‌తో ఒక్కసారిగా ఫ్యాన్స్‌ ఈళలతో మైదానం మారుమోగింది.

అనంతరం దిల్‌ రాజు గేమ్‌ ఛేంజర్‌ గురించి మాట్లాడారు. “మెగా పవర్‌ స్టార్‌లో ‘మెగా’ని, ‘పవర్‌’ని చూస్తారు. ఇందులో ఇదివరకు ఎప్పుడు చూడని చరణ్‌ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు. ఇందులో చరణ్‌ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. కాసేపు రాజకీయ నాయకుడిగా, మరికొంత సేపు ఐఏఎస్‌ అధికారి, ఇంకా కొంత సేపు పోలీస్‌ ఆఫీసర్‌గా ఆయన నట విశ్వరూపం చూస్తారు. దర్శకుడు శంకర్‌ మార్క్‌ను కచ్చితంగా కనిపించబోతుంది. సినిమా నిడివి 2:45 నిమిషాలు మాత్రమే ఉండాలని శంకర్‌ చెప్పాను. అంతే నిడివిలో ఆయన అద్భుతమైన అవుట్‌పుట్‌ ఇచ్చారు” అని చెప్పారు.

Exit mobile version