Nani: ఘంటా నవీన్ బాబు.. ఈ పేరు ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అదే నాని అని చెప్పండి. మా పక్కింటి అబ్బాయే అని చెప్పుకొచ్చేస్తారు. అంతలా ప్రేక్షకులకు దగ్గరయ్యిపోయాడ. తన న్యాచురల్ నటనతో.. న్యాచురల్ స్టార్ గా మారిపోయాడు. అసలు ఎవరీ నాని.. ఎక్కడ నుంచి వచ్చాడు.. ? అతని సక్సెస్ ఫార్ములా ఏంటి.. ?అంటే డెడికేషన్ అని చెప్తారు ఆయన అభిమానులు.
సినిమా ఇండస్ట్రీకి రావాలంటే.. కోర్స్ లు నేర్చుకోవాలి. నటనకు మెరుగులు పెట్టాలి అనేది పాత పద్ధతి. కానీ, ఇప్పుడు జనరేషన్ అలా లేదు. స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చేవారికి ఒకప్పుడు చిరంజీవి ఇన్సిఫిరేషన్ అయితే.. ఇప్పుడు నాని అని చెప్పొచ్చు. ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ హీరోగా మారిన వైనం ఎంతోమందికి ఆదర్శం.
ఘంటా నవీన్ బాబు అలియాస్ నాని.. లెజండరీ డైరెక్టర్ బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టాడు. అలా అందరితో కలివిడిగా తిరుగుతూ అష్టాచమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఆ సినిమాకు ముందు అనుకున్న హీరో వేరు. ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసిపెట్టి ఉన్నట్లు.. ప్రతి సినిమాకు హీరో ఎవరు అనేది రాసిపెట్టి ఉంటుంది. అలా అసిటెంట్ డైరెక్టర్ నుంచి నాని హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు.
అష్టాచమ్మా బిగినింగ్ మాత్రమే. ఆ తరువాత నాని విభిన్నమైన కథలను ఎంచుకోవడం మొదలుపెట్టాడు. విజయాపజయాలను పట్టించుకోలేదు. ప్రేక్షకులను ఎలా మెప్పించాలి అనేది మాత్రమే ఆలోచించాడు. ఇప్పటివరకు నాని పరిచయం చేసిన హీరోయిన్స్, డైరెక్టర్స్ స్టార్స్ గా కొనసాగుతున్నారు. ఒక స్టార్ గా మారాకా.. కొత్త డైరెక్టర్స్ ను నమ్మడానికి ఎవరైనా భయపడతారు. కానీ, నాని మాత్రం కొత్త డైరెక్టర్స్ ను పరిచయం చేయడమే పనిగా పెట్టుకున్నాడు.
ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోకు ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. కొందరు క్లాస్ హీరోగా.. ఇంకొందరు మాస్ హీరోగా.. మరికొందరు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ, నాని మాత్రం విలక్షణ నటుడు అని చెప్పుకోవచ్చు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ కూడా ఆయన సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు నాని కొత్త కోణాన్ని చూపిస్తున్నారు.
The Paradise: ఇది కడుపుమండిన కాకుల కథ.. నాని సినిమాలో ఈ రేంజ్ బూతులా?
జెర్సీ, అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్, దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం.. ఇలా క్లాస్, మాస్ అనే తేడా లేకుండా విభిన్నంగా కనిపిస్తూ వచ్చిన నాని.. ఇకనుంచి తన నిజస్వరూపాన్ని బయటపెట్టడానికి రెడీ అయ్యాడు. నాని పేరు వినగానే.. కుటుంబం మొత్తం చూసే సినిమాలు తీస్తాడు అతడేనా అని అడుగుతారు. కానీ, ఇప్పుడు మాత్రం ఈ హీరో కుటుంబం మొత్తం కలిసి చూడలేని సినిమాలు తీయడం మొదలుపెట్టాడు.
దసరా, సరిపోదా శనివారం కొంచెంలో కొంచెం అయినా పెద్దవాళ్ళతో కలిసి చూడొచ్చు. కానీ, నాని ఇప్పుడు నటిస్తున్న హిట్ 3 కానీ, ది ప్యారడైజ్ కానీ.. చిన్నపిల్లలు, కుటుంబంతో కలిసి చూడలేని పరిస్థితి. అంత వైలెంట్ గా నాని సినిమాలు ఉంటాయి అనేది ఊహించుకోవడం కూడా కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకు న్యాచురల్ స్టార్ ఇలా మారడానికి కారణం ఏంటి.. ? అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్ని వైలెన్స్ మీదనే నడుస్తున్నాయి.
కెజిఎఫ్, యానిమల్, పుష్ప 2, మార్కో.. ఇలా ప్రతి సినిమాలో హీరో వైలెన్స్ ను అభిమానులు ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అందుకే నాని కూడా రూటు మార్చి వైలెన్స్ లోకి దిగాడు. మొన్నటికి మొన్న హిట్ 3 టీజర్ లో ఒక మనిషిని నిలువుగా నరికేశాడు. బూతులు మాట్లాడాడు. సరే అది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాబట్టి సర్దుకుపోవచ్చు అనుకుంటే.. ఇక తాజాగా రిలీజైన ది ప్యారడైజ్ గ్లింప్స్ లో దానికి మించిన వైలెన్స్, బూతులు కనిపించాయి.
నాని మొదటి సినిమా ఒక కోటి రూపాయలతో ఫినిష్ చేశారట. ఇక ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమా గ్లింప్స్ కోసమే కోటి ఖర్చుపెట్టారని నాన్ని చెప్పుకొచ్చాడు. అంటే ఒక సినిమాకు పెట్టే బడ్జెట్.. ఒక గ్లింప్స్ కు ఖర్చు పెట్టారు అంటే అది అతడి రేంజ్. అప్పుడు ఎంతో సాఫ్ట్ గా, కూల్ బాయ్ లా ఉండే నాని ఇప్పుడు ఊర మాస్ లుక్ లో కనిపించి షాక్ ఇస్తున్నాడు. దీనివలన న్యాచురల్ స్టార్.. ఫ్యామిలీ ఆడియెన్స్ కు దూరం అవుతాడా.. ? అనే అనుమానం ఫ్యాన్స్ లో లేకపోలేదు. అయితే కంటెంట్ ఉన్నోడు ఎలా వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది కూడా నమ్మదగ్గ నిజమే. మరి ఈ సినిమాలతో నాని వైలెంట్ స్టార్ గా మారతాడా..? ఆ సినిమాలతో సక్సెస్ అందుకుంటాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.