Breaking News

పరీక్షా కేంద్రాలను మార్చుకోండి..!

01 st Jul 2020, UTC
పరీక్షా కేంద్రాలను మార్చుకోండి..!
కరోనా మహమ్మారి నేపధ్యం లో దాదాపు అన్ని రాష్ట్రాలు.. వివిధ రకాల పరీక్షలు వాయిదా వేస్తూ  వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. యూపీఎస్‌సీ సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలు అక్టోబర్ లో నిర్వహించనున్నట్లుగా అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 4న ఈ యూపీఎస్‌సీ సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలు దేశవ్యాప్తం గా జరగనున్నాయి.  ఈ మేరకు యూపీఎస్‌సీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఈ పరీక్షలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరు కానున్నారు. 
 
                తాజాగా.. ఎక్కువ మంది అభ్యర్థులు హాజరు అవుతున్న కారణం గా.. అభ్యర్ధన మేరకు వారి పరీక్షా కేంద్రాలను మార్చుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు యూపీఎస్‌సీ తెలిపింది.  అదనపు అభ్యర్థుల కోసం.. ఆయా కేంద్రాల్లో వసతులు కూడా పెంచనున్నారు. దీని ఆధారం గా పరీక్షా కేంద్రాల మార్పు అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకుంటామని యూపీఎస్‌సీ తమ ప్రకటన లో పేర్కొంది.
 
              అభ్యర్ధులు పరీక్ష కేంద్రాల మార్పుకు సంబంధించిన ఆప్షన్‌ను జులై 7-13 వరకూ జులై 20-24 వరకూ రెండు దశల్లో కమిషన్‌ వెబ్‌సైట్‌  https://upsconline.nic.inద్వారా అందించాలని కోరింది. ఈ పరీక్షలకు హాజరు అయ్యే అభ్యర్థులు ఈ వెబ్సైటు ను దర్శించి తమకు అనువైన పరీక్షా కేంద్రం ను ఎంపిక చేసుకుని ఆ ఎంపిక ను సమర్పించాలని కోరింది. అభ్యర్ధుల వినతులను ‘ఫస్ట్‌ అప్లై-ఫస్ట్‌ అలాట్‌’ పద్ధతిన పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అయితే.. సీలింగ్ కారణం గా కోరుకున్న పరీక్షా కేంద్రాన్ని పొందలేని వారు మిగిలిన వాటి నుంచి ఒక కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox