Breaking News

పరీక్షల వల్ల ఒక్కరు చనిపోయినా రూ.కోటి పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు

24 th Jun 2021, UTC

పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడ్‌విట్‌‌ పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం కాదు. దానికి ఎటువంటి కసరత్తు చేశారు? అని అడిగింది.

15 నుంచి 18 మంది విద్యార్థులు పరీక్ష తరగతి గదిలో ఉంటే 34 వేల తరగతి గదులు కావాలి. 34 వేల మంది సిబ్బంది కావాలి. అన్నింటిపై అధ్యయనం చేశారా? అంటూ ప్రశ్నించింది. ఇతర బోర్డుల ఫలితాలు ముందుగా వస్తే విద్యార్థులకు ఇబ్బంది కాదా? సరైన అధ్యాయం కసరత్తు లేకుండా పరీక్షలకు వెళ్తే విద్యార్థులు, సిబ్బంది ప్రమాదంలో పడతారని  వ్యాఖ్యానించింది. ఏదైనా అనికోని ఘటన జరిగితే నష్టపరిహారం సంతేంటని  ధర్మాసనం ప్రశ్నించింది. పరీక్షల వల్ల ఒక్కరు చనిపోయినా రూ.కోటి పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.

దీనికి ఏపీ ప్రభుత్వం సమాధానమిస్తూ పరీక్షల నిర్వహణ పై చాలా కష్టంగా నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. భద్రతా ప్రమాణాలన్ని పాటిస్తున్నాం.పరీక్షల నిర్వహణకు 50 వేల మంది సిబ్బంది ఉన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు పరీక్షల నిర్వహణకు వినియోగిస్తామని తెలిపారు.

అన్ని అంశాలపై సోమవారం అఫిడవిట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనితో రేపే అఫిడవిట్ దాఖలు చేయాలని మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరుగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox