Breaking News

వెటర్నరీ, ఫిషరీస్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

01 st Oct 2020, UTC

హైదరాబాద్ :పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పాలిటెక్నిక్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పశు సంవర్ధక, మ‌త్స్య‌శాస్త్రాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రెండు సంవత్సరాల పాటు కోర్సు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను అక్టోబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం . https://tsvu.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లోని పశుసంవర్ధక పాలిటెక్నిక్ కాలేజీల్లో 30 మంది చొప్పున, మామునూరు కాలేజీలో 20 మందికి ప్రవేశం కల్పిస్తారు. కృష్ణా జిల్లాలోని భావదేవరపల్లె మత్స్య పాలిటెక్నిక్ కాలేజీల్లో 11 మందికి ప్రవేశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సులకు పది పాసైన విద్యార్థులు మాత్రమే అర్హులు. వారికి పదిలో వచ్చిన గ్రేడుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox