Breaking News

తెలంగాణలో కేజీ టూ పీజీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లోనే బోధ‌న

29 th Jun 2021, UTC

తెలంగాణలో కేజీ టూ పీజీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లోనే బోధ‌న కొన‌సాగించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. విద్యా సంస్థ‌ల పునఃప్రారంభం, ఇత‌ర అంశాల‌పై విద్యాశాఖ అధికారుల‌తో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి  సోమవారం స‌మీక్ష నిర్వహించారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడారు.

జులై 1వ తేదీ నుంచి కేజీ టూ పీజీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లోనే బోధ‌న కొన‌సాగుతుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. సెట్స్‌కు సంబంధించిన తేదీల్లో ఎలాంటి మార్పుల్లేవు. ఇంత‌కు ముందు ప్ర‌క‌టించిన తేదీల ప్ర‌కార‌మే ప్ర‌వేశ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. విదేశాల‌కు వెళ్లే విద్యార్థుల‌కు నిర్వ‌హించే ప‌రీక్ష‌ల‌ను కూడా జులై నెల‌లో నిర్వ‌హిస్తామ‌న్నారు. ఈ ప‌రీక్ష‌లు ర‌ద్దు కావ‌ని మంత్రి స‌బిత స్ప‌ష్టం చేశారు.

50 శాతం మంది టీచ‌ర్లు మాత్ర‌మే విధుల‌కు హాజ‌రు కావాలి. రోజు విడిచి రోజు టీచ‌ర్లు విధుల‌కు హాజరు అవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన జీవో జారీ అవుతుంద‌న్నారు. ప్ర‌యివేటు పాఠ‌శాల‌లు త‌ప్ప‌నిస‌రిగా 46 జీవోను అమ‌లు చేయాలి. ట్యూష‌న్ ఫీజును మాత్ర‌మే తీసుకోవాలి మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మరిన్ని వార్తలు చదవండి 

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox