Breaking News

నేడు నీట్ పరీక్ష

13 th Sep 2020, UTC
నేడు నీట్ పరీక్ష
 
హైదరాబాద్ :ఈ రోజు జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష జరుగుతోంది.మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే నీట్ పరీక్ష కుదేశ వ్యాప్తంగా 15,97,433 మంది విద్యార్దులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి 55,800 మంది దరఖాస్తు చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు.
 
విద్యార్థులు తప్పని సరిగా మాస్క్ లు ధరించాలి.ప్రతి విద్యార్థి తప్పనిసరిగా కొవిడ్‌ నియంత్రణ మార్గాలను పాటించాలి. పరీక్షా కేంద్రం వద్ద సామాజిక దూరం పాటించాలి. ఒక్కో గదికి 14 మంది విద్యా ర్థులు మాత్రమే ఉంటారు. పరీక్ష ప్రారంభం కావడానికి ముందు విద్యార్థులు కూర్చునే ప్రదేశాలను శాని టైజ్‌ చేస్తారు. విద్యార్థికి విద్యార్థికి మధ్య రెండు సీట్ల గ్యాప్‌ ఉంటుంది. పరీక్షా కేంద్రం లోపలకు వెళ్లే ప్రదేశంలో శానిటైజర్‌ అందుబాటులో ఉంటుంది. టెంపరే చర్‌ పరిశీలించిన తరువాత లోపలకు అనుమతిస్తారు. 
 
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా అడ్మి ట్‌ కార్డు, సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారమ్‌, ఫొటో (అప్లికేషన్‌లో ఉన్నటువంటిదే) తప్పనిసరిగా తీసుకురావాలి. అడ్మిట్‌ కార్డుపై తండ్రి/తల్లి సంతకం చేయించాలి. 50 ఎంఎల్‌ శానిటైజర్‌ బాటిల్‌, మాస్క్‌, గ్లోవ్స్‌, వాటర్‌ బాటిల్‌ తెచ్చుకోవచ్చు. పరీక్షా కేంద్రంలో ఇచ్చిన పెన్‌ తో మాత్రమే ఓఎంఆర్‌ షీట్‌లో జవాబులను గుర్తించాల్సి ఉంటుంది. ఫుల్‌ హ్యాండ్స్‌ షర్టులు, బూట్లు ధరించకూడదు. విద్యార్థినులు చుడీదార్‌ మాత్రమే ధరించాలి. అడ్మిట్‌ కార్డుపై సూచించిన ప్రాంతంలో ఎడమ చేతి బొటన వేలి ముద్ర వేయాలి. విద్యార్థి తన సంతకాన్ని పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌ ముందుమాత్రమే పెట్టాలి. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox