Breaking News

జాతీయ విద్యా విధానం-2020 లక్ష్యమిదే..!

08 th Sep 2020, UTC
జాతీయ విద్యా విధానం-2020  లక్ష్యమిదే..!

న్యూఢిల్లీ :తాజాగా భారత్ లో జాతీయ విద్యా విధానం-2020 ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విద్య విధానం పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ విద్యా విధానంలో ప్రభుత్వ జోక్యం పరిమితంగానే ఉండాలని మోదీ చెప్పుకొచ్చారు. తాజాగా ఈ విద్యా విధానం గురించి రాష్ట్రాల గవర్నర్ లతో పాటు, రాష్ట్ర పతి రామ్ నాధ్ కోవింద్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘రోల్‌ ఆఫ్‌ ఎన్‌ఈపీ ఇన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’అనే అంశంపై ప్రసంగించారు. ఈ జాతీయ విద్యా విధానం కేవలం ప్రభుత్వ విధానం మాత్రమే కాదని, భారత దేశ విద్యా విధానమని ప్రధానమంత్రి చెప్పుకొచ్చారు. ఈ విద్యా విధానం  దేశ విదేశాంగ, రక్షణ విధానాలతో సమానమైన ప్రాముఖ్యతను కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ విద్యా విధాన అమలులో మార్పు చేర్పులకు చోటు కల్పించాలని, ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేయాలనీ మోదీ సూచించారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ ప్రజాస్వామ్య విలువలను అభ్యసించడానికి ఎలాంటి ఒత్తిడి లేని విద్యా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. అవసరానికి మించిన స్కూలు బ్యాగుల, బోర్డు పరీక్షలు, సొసైటి నుంచి ఒత్తిడిలు వంటివి విద్యార్థులకు ఉండకూడదన్నారు.

డాక్టర్ కె.కస్తూరి రంగన్ ఆద్వర్యం లో విద్యావేత్తలు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిపి దాదాపు రెండు లక్షల మంది అభిప్రాయాల మేరకు ఈ నూతన జాతీయ విద్యా విధాన రూపకల్పన జరిగింది. " భారత్‌ కేంద్రంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం ద్వారా ప్రపంచంలో భారత్‌ను సూపర్‌ పవర్‌గా తయారు చేయడమే ఎన్‌ఈపీ-2020 లక్ష్యమని" ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. జాతీయ విద్యా విధానం-2020  పై సెప్టెంబర్ 25 లోపు అన్ని యూనివర్సిటీల్లోనూ వర్చువల్ సదస్సులు నిర్వహించాలని ప్రధాని కోరారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాట్లాడుతూ పరిశోధన, అభివృద్ధి’పై ప్రభుత్వ నిధులను భారీగా కేటాయించాలన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఈ రంగంలో తక్కువగా కేటాయిస్తోందన్నారు. సృజనాత్మక ఆవిష్కరణలపై పెట్టుబడులు పెట్టడం భారత్ ఆర్ధిక వ్యవస్థకు అత్యవసరమన్నారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox