హైదరాబాద్ : మంత్రి మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ పై ఐదేళ్ల నిషేధం విధించబడింది. ఈ విషయాన్నీ నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటన చేసింది. హైదరాబాద్ లోని కొంపల్లిలో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. ఈ కాలేజీ యాజమాన్యం తప్పుడు డాక్యూమెంట్లను పంపిన కారణంగా న్యాక్ ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, 2018వ సంవత్సరంలో ఈ కాలేజీకి న్యాక్ బీ++ గ్రేడ్ ను కేటాయించింది. అయితే, కాలేజీ గ్రేస్ ను మరింతగా పెంచాలని ఈ కాలేజీ యాజమాన్యం భావించింది. ఈ క్రమంలో న్యాక్ బెంగళూర్ ఆఫీస్ కు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం ఫేక్ డాక్యుమెంట్ లను పంపించి మోసం చేయడానికి ప్రయత్నించింది. ఈ మోసాన్ని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో న్యాక్ అధికారులు చర్యలు చేపట్టారు. అక్రిడేషన్ విషయంలో ఐదు సంవత్సరాల పాటు మల్లారెడ్డి కాలేజ్ పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ విషయమై కాలేజీ యాజమాన్యం ఇంత వరకు స్పందించలేదు. మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి

Read latest తెలంగాణ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
15 Jan 2021
15 Jan 2021
15 Jan 2021
15 Jan 2021
15 Jan 2021
15 Jan 2021