మహారాష్ట్రకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్ సిన్హ్ దిసాలేను ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్-2020’ వరించింది. దీనికి ఆయన రూ.7.38 కోట్ల (1 మిలియన్ అమెరికన్ డాలర్ల) నగదు బహుమతి అందుకోనున్నారు. ఉపాధ్యాయునిగా అత్యంత ప్రభావం చూపి, వృత్తిలో అత్యుత్తమంగా నిలిచిన వారికి వర్కీ ఫౌండేషన్ ఏటా ఈ అవార్డును అందిస్తోంది. లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో గురువారం ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ బహుమతి కోసం 140 దేశాల నుంచి మొత్తం 12 వేలకు పైగా నామినేషన్లు వచ్చాయనీ, తుది దశ ఎంపికలో మొత్తం పది మంది నిలవగా రంజిత్ విజేతగా నిలిచారని ఫౌండేషన్ ప్రతినిధులు ప్రకటించారు.
రంజిత్ సిన్హ్ దిసాలే విద్యార్థులకు స్థానిక భాషలో పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడటం, తరగతి పాఠ్యపుస్తకాలను విద్యార్థుల మాతృభాషలోకి అనువదించడమే కాకుండా, ఆడియో పాఠాలను అందించేందుకు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్లను తీసుకొచ్చారు. వీటితోపాటు వీడియో ఉపన్యాసాలు, కథలు, ఎసైన్‌మెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేశారు. దీంతో మహారాష్ట్రలో క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టిన తొలి పాఠశాలగా దిసాలే ఆధ్వర్యంలోని స్కూలు నిలిచింది. దిసాలే ప్రతిపాదిత పైలట్ పథకం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెడతామని రాష్ట్ర మంత్రిత్వ శాఖ 2017 లో ప్రకటించింది. అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టి) పాఠ్యపుస్తకాలు క్యూఆర్ కోడ్‌తో రూపొందించాలని 2018లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
ప్రపంచ దేశాల యువకుల మధ్య శాంతిని పెంపొందించేందుకుకూడా దిసాలే విశేష కృషి చేశారు."లెట్స్ క్రాస్ ది బోర్డర్స్" ప్రాజెక్ట్ పేరుతో ప్రారంభించిన కార్యక్రమంలో భారతదేశం, పాకిస్తాన్, పాలస్తీనా ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, యుఎస్, ఉత్తర కొరియాకు చెందిన అనేకమంది యువకులను భాగస్వామ్యం చేశారు. ఇప్పటివరకు, ఎనిమిది దేశాల 19,000 మంది విద్యార్థులనుఇందులో చేరారు. మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేటర్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ ద్వారా వీకెండ్స్‌లో విద్యార్థులను వర్చువల్ ఫీల్డ్ ట్రిప్స్‌కు తీసుకెళతారు.
2014 లో ఏర్పాటయిన వర్కీ ఫౌండేషన్ ఉపాధ్యాయు వృత్తిలో విశేష కృషి చేసిన అసాధారణమైన టీచర్ల కుప్రపంచ వ్యాప్తంగా వార్షిక బహుమతిని ప్రకటిస్తుంది. 140 కి పైగా దేశాల నుండి 12వేల మందికి పైగా దరఖాస్తు చేయగా తుది విజేతగా దిసాలే ఎంపికయ్యారు. మరిన్ని జాతీయ వార్తలు చదవండి

Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
19 Jan 2021
19 Jan 2021
19 Jan 2021
20 Jan 2021