Breaking News

90 రోజుల్లో 350 ఆన్ లైన్ కోర్సులు పూర్తి చేసింది..

01 st Oct 2020, UTC

కేరళ :కరోనా మహమ్మారి నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ తరువాత కూడ చాలకాలం పాటు తెరచుకోని స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు, దీనితో ప్రజలు ఇంటిపట్టునే వుండవలసిన పరిస్దితి. దీనిని ఒక్కొక్కరు ఒకోలా ఉపయోగించుకున్నారు. టీవీలు, సినిమాలు చూస్తూ గడిపిన వారు కొందరయితే తమకు ఇష్టమయిన హాబీలతో కాలం గడిపిన వారు మరికొందరు. ఈ నేపధ్యంలో కేరళకు చెందిన ఒక యువతి 90 రోజుల్లో 350 ఆన్ లైన్ కోర్సులు నేర్చుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది.

కేరళలోని కోచికి చెందిన ఆర్తి రఘునాధ్ అనే యువతి ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ రెండవ సంవత్పరం చదువుతోంది. లాక్ డౌన్ తో వచ్చిన ఖాళీ సమయంలో ఆన్ లైన్ ప్లాట్ ఫారం కోర్ సెరాలో పలు కోర్సులు చేసింది. మొత్తం 90 రోజుల్లో ఈ యువతి 350 రకాల కోర్సులు చేసింది. తాను ఈ కోర్సులు చేయడం వెనుక తన కాలేజీ ప్రిన్సిపాల్ మహమ్మద్, కోర్ సెరా కో ఆర్డినేటర్ హనీఫా, ట్యూటర్ నీలిమల సహకారం చాల వుందని ఆమె తెలిపింది. ప్రపంచంలో ప్రసిద్ది చెందిన పలు విశ్వవిద్యాలయాలు ఆఫర్ చేసిన కోర్సులను ఆర్తి  పూర్తి చేయడం విశేషం. వీటిలో జాన్ హాకిన్స్ యూనివర్షిటీ, టెక్నికల్ యూనివర్షిటీ ఆఫ్ డెన్మార్క్, యూనివర్షటీ ఆఫ్ వర్జీనియా, స్టేట్ యూనివర్షిటీ ఆఫ్ న్యూయార్క్, యూనివర్షిటీ ఆఫ్ కొలరాడో బోల్డర్,యూనివర్షిటీ ఆఫ్ కోపెన్ హెగన్చ యూనివర్షిటీ ఆఫ్ రాచెస్టర్ అండ్ ఎమొరీ యూనివర్షిటీ  వున్నాయి. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox