Breaking News

పదేళ్లు జాబ్ చేయాలి.. లేకుంటే కోటి రూపాయలు ఫైన్ కట్టాలి.. పీజీ వైద్యులకు యూపీ సర్కార్ ఆదేశం

13 th Dec 2020, UTC

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులకు 10 సంవత్సరాల వైద్య సేవలను తప్పనిసరి చేసింది. మధ్యలో ఉద్యోగాన్ని వదిలి 10 సంవత్సరాలు పూర్తి చేయడంలో విఫలమైన వారు కోటిరూపాయలు పరిహారం చెల్లించాలి.యూపీ ప్రిన్సిపల్ సెక్రటరీ (హెల్త్) అమిత్ మోహన్ ప్రసాద్ శనివారం ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చేస్తున్న వైద్య విద్యార్థుల కోసం యుపి ప్రభుత్వం ఈ విభాగంలో 10 సంవత్సరాల సేవలను తప్పనిసరి చేసింది. అలా చేయడంలో విఫలమైన ఎవరైనా కోటిరూపాయలు  జరిమానా చెల్లించాలి .

ఒక విద్యార్థి పిజి కోర్సును  మధ్యలో విడిచిపెడితే, అతడు / ఆమె రాబోయే మూడేళ్ళకు కోర్సు నుండి డిబార్ చేయబడతారని ఆయన  తెలిపారు.అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుల కోసం 15 వేలకు పైగా పోస్టులు సృష్టించబడ్డాయి. ప్రస్తుతం 11,000 మంది ఎంబిబిఎస్ వైద్యులను వీటిలో నియమిస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులు మరియు వైద్య కేంద్రాలలో స్పెషలిస్ట్ వైద్యుల కొరత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.కోవిడ్ -19 మహమ్మారి నేపధ్యంలో వైద్యుల కొరతను పరిష్కరించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తమ ఎండి, ఎంఎస్, మరియు పిజి డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వైద్యులను నిర్దిష్ట కాలానికి ప్రభుత్వ రంగంలో తప్పనిసరిగా సేవ చేయాలని కోరింది. మరిన్ని జాతీయ వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox