Breaking News

కాకతీయ యూనివర్సిటీ పీహెచ్ డీ ప్రవేశాల్లో గందరగోళం

22 nd Jun 2022, UTC

Warangal: ఐదేళ్ల తరువాత వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాల్లో గందరగోళం నెలకొందా, అధికారులు యూజీసీ నిబంధనలను పాటించటం లేదా అంటే అవుననే అంటున్నారు కేయూలోని పీహెచ్ డీ అభ్యర్ధులు. కేయూ అధికారులు పార్ట్ టైం అభ్యర్ధులకు అవకాశం ఇవ్వటం కోసం యూజీసీ నిబంధనలు మార్చి అడ్మిషన్లు ఇస్తుండటంతో పీహెచ్ డీ చేయాలనే ఆశతో ఎదురు చూస్తున్న అభ్యర్ధులు నిరాశకు గురి అవుతున్నారు. అదేమీ పట్టించుకోకుండా నోటిఫికేషన్ ఇచ్చిన అధికారుల తీరుపై మండిపడుతున్నారు. 

వరంగల్ కేయూలో పీహెచ్ డీ కోసం కేటగిరీ వన్ అడ్మిషన్లకు గాను నోటిఫికేషన్ జారీ చేసారు. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం కేటగిరీ-1కు సంబంధించి పీహెచ్డీ అడ్మిషన్లను ఫుల్ టైమ్ స్కాలర్స్ నే  తీసుకుంటామంటూ నోటిఫికేషన్లో పేర్కొంది. తదనుగుణంగానే అప్లికేషన్లు తీసుకున్న ఆఫీసర్లు, డిపార్ట్ మెంట్ల వారీగా గత నెల 20 నుంచి 28 వరకు నిర్వహించి ఇంటర్వ్యూలు పూర్తి చేశారు. ముందుగా నిబంధనలో సూచించిన ప్రకారం పీహెచ్డీ అభ్యర్థులకు జేఆర్ఎఫ్, యూజీసీ నెట్, గేట్, సెట్, ఎంఫిల్ సైన్స్ విద్యార్థులకు అర్హతలుగా తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.అడ్మిషన్ ప్రాసెస్ పూర్తయిన చివరి రోజు మే 28 నోటిఫికేషన్ రూల్స్ లో పొందుపరిచిన ఫుల్ టైమ్ తప్పనిసరి అనే నిబంధనను సవరించారు. ప్రభుత్వ డిగ్రీ పీజీ కాలేజీల్లో పని చేసే అధ్యాపకులకు సైతం 25 శాతం కేటగిరీవన్  సీట్లు ఇచ్చేవిధంగా మార్పులు చేశారు. ఈ సవరణ వల్ల ఫుల్ టైం పీహెచ్డీ చేయాలనుకున్న అభ్యర్థులకు నిరాశే మిగిలినట్లయింది. పీహెచ్ డీ లో కేయూ అదికారులు ఇచ్చిన నిబందనలను పక్కన పెట్టి, కొంత మందికి లబ్ధి చేకూరేలా కేయూ అడ్మిషన్ కమిటీ వ్యవహరించిందని పీహెచ్ డీ కోసం దరఖాస్తులు చేసుకున్న విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. 

పీహెచ్ డీ చేయాలనే ఆశతో తాము ఎంతో కష్ట పడి ఇంటర్వ్యూలు పూర్తి చేసామని, తమకు పీహెచ్ డీ లో అవకాశం లబిస్తుందని ఎంతో ఆశపడినట్టు విద్యార్ధులు వాపోయారు. చివరి తేది మే 28న తుది ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఫుల్ టైం రీసెర్చ్ నిబంధననలు సవరించి, తమకు అనుకున్నవారికే పీజీ, డిగ్రీ కాలేజీలోల బోధిస్తున్న లెక్చరర్లకు అనుగుణంగా సవరణ తీసుకొచ్చారని విద్యార్ధులు మండిపడ్డారు. కేయూ అధికారులు నిబందనలు పాటించకుండా పార్ట్ టైం వారికి అవకాశం ఇచ్చేందుకు నిబందనలు సడలింపులు చేసి తమకు తీరని అన్యాయం చేస్తున్నారని స్టూడెంట్స్ ఆరోపించారు. కేయూ పీహెచ్ డీలో జరిగిన తప్పిదాల పై తాము ఉన్నత విద్యామండలి చైర్మన్ కు పిర్యాదు చేస్తామన్నారు

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox