Breaking News

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం

06 th May 2022, UTC

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించడం లేదు అధికారులు. పరీక్షలకు రెండు రాష్ట్రాల్లోనూ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 

తెలంగాణ వ్యాప్తంగా 9 లక్షల 7 వేల 393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వారి కోసం వెయ్యి 443 ఎగ్జామినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 75 మంది ఫ్లయింగ్, 150 మంది సిట్టింగ్​స్క్వాడ్స్, 25 వేల మంది ఇన్విజిలేటర్లు పని చేస్తున్నారు. 

ఏపీలో ఈ ఏడాది ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్లకు కలిపి మొత్తం 9 లక్షల 14 వేల 423 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వృత్తి విద్య పరీక్షలను 87 వేల 435 మంది రాయనున్నారు. ఏపీలో వెయ్యి 456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox