Breaking News

వర్చువల్ బాట పట్టిన ఐఐటీ బాంబే..!

25 th Jun 2020, UTC
వర్చువల్ బాట పట్టిన ఐఐటీ బాంబే..!

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నతరుణంలో  ఈ ఏడాది చివరి వరకూ ముఖా ముఖీ పాఠ్యాంశ బోధనను నిలిపివేస్తున్నట్టు ఐఐటీ బాంబే ప్రకటించింది. ఆన్‌లైన్ విధానంలోనే బోధన కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాల్లో స్కూల్ స్థాయిలో ఆన్‌లైన్ విద్యాబోధన జరుగుతోంది. తాజాగా ఐఐటీ బాంబే వంటి పత్రిష్ఠాత్మక సంస్థ కూడా వర్చువల్ బాట పట్టింది. ఈ నిర్ణయం తీసుకున్న తొలి ప్రభుత్వరంగ విద్యాసంస్థ కూడా ఐఐటీ బాంబేనే కావడం గమానార్హం.

ఐఐటీ బాంబే డైరెక్టర్ ఫ్రొ. శుభాశిశ్ చౌదరి ఈ విషయాల్ని ఫేస్‌‌బుక్ పోస్ట్‌లో వెల్లడించారు. విద్యార్థుల రక్షణకే ఐఐటీ బాంబే తొలి ప్రాధాన్యం ఇస్తుంది. అయితే కరోనా సంక్షోభం నెలకొన్న తరుణంలో బోధన ఎలా సాగాలనే అంశంపై మేము లోతైన సమీక్ష జరిపాం. కొత్త సెమిస్టర్‌లో బోధన పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరపాలని నిర్ణయించాం అని ఆయన తెలిపారు.

అయితే  ఐఐటీ బాంబేలో అల్పదాయ వర్గాల విద్యార్థులు అధిక సంఖ్యలోనే ఉంటారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ విద్యకు అవసరమైన వసతులను ఏర్పాటు చేసేందుకు విరాళాలు ఇవ్వాలని కూడా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

మా విద్యార్థుల్లో అధిక శాతం మంది అల్పాదాయ వర్గాల వారే. ఆన్‌లైన్ క్లాసులకు అవసరమైన ల్యాప్‌టాప్‌లు, బ్రాండ్‌బ్యాండ్ కనెక్షన్ ఏర్పాటు చేసేందుకు వారికి సహాయం అవసరమవుతుంది. ఇందుకు దాదాపు ఐదు కోట్లు రూపాయలు అవసరమవుతాయనేది మా అంచనా. కాబట్టి.. ఎటువంటి అడ్డంకులు లేకుండా విద్యార్థులు చదువు కొనసాగించేందుకు ప్రజల సహాయం కోరుతున్నాము అని ఆయన తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox