Breaking News

ఈ హైదరాబాదీ హ్యూమన్ కంప్యూటర్ ప్రపంచ విజేత..!

23 rd Aug 2020, UTC

టెక్నాలజీ: కంప్యూటర్ లు, చేతి లోకి స్మార్ట్ ఫోన్ లు వచ్చాక.. మనం లెక్కలేయడమే మర్చిపోయాం.. కానీ ఎంత పెద్ద లెక్కనైనా.. సులువు గా మనసులో చేసేయగలగడం అంటే అదో అద్భుతమే.. హైదరాబాదుకు చెందిన నీలకంఠ భానుప్రకాశ్ ను నడిచే హ్యూమన్ కంప్యూటర్ గా పేర్కొంటారు.. చిన్న వయసు నుంచే మాథ్స్ లో ఎన్నో వండర్స్ చేసాడు భాను ప్రకాష్. పెన్ను, పేపర్ లేక కాలిక్యులేటర్ లేకపోతె.. లెక్కలు ఆక్యురేట్ గా రావని భావిస్తున్న రోజుల్లో కూడా ఎంత పెద్ద లెక్కనైనా.. సులువు గా మనుసులో చెయ్యగలగడం భాను ప్రకాష్ కు వెన్నతో పెట్టిన విద్య.

ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజి నుంచి మ్యాథ్స్ లో గ్రాడ్యుయేషన్ చేసిన భాను ప్రకాష్ కు లండన్ లో జరిగిన మెంటల్ కాలిక్యులేషన్స్ వరల్డ్ చాంపియన్ షిప్ లో టైటిల్ లభించింది. భారత్ నుంచి ఎంపికైన వ్యక్తి భాను ప్రకాష్ ఒక్కడే. 13 దేశాల నుంచి వచ్చిన 30 మంది పార్టిసిపెంట్స్ తో పోటీపడిన ఈ తెలుగు బిడ్డ మొదటి ప్రయత్నం లో నే విజయం సాధించాడు. ఐదేళ్ల వయసు నుంచే గణితంలో అద్భుతాలు చేస్తూ వండర్ కిడ్ గా పేరుతెచ్చుకున్న భానుప్రకాశ్ అబాకస్ విద్యలోనూ ప్రపంచస్థాయిలో విజేతగా నిలిచాడు. ఇప్పటి వరకు భాను ప్రకాష్ ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేషన్, పవర్ మల్టిప్లికేషన్ రికార్డ్, ద సూపర్ సబ్ ట్రాక్షన్ రికార్డ్ లను నెలకొల్పాడు. అయితే..ఈ విజేత మాత్రం ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటాడు.. రికార్డుల పట్ల మక్కువ లేదని, గణితంలో నిపుణులతో, మానవ కాలిక్యులేటర్లతో ఓ వర్గాన్ని తయారుచేయాలన్నదే తన లక్ష్యం అని ఎపుడు చెబుతుంటాడు. తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ల నుంచి కూడా గణిత మేధావులను తీసుకురావడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. మరిన్ని టెక్నాలజీ వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox