Breaking News

ఇస్లామిక్ అధ్యయనం ఎంట్రెన్స్ లో టాపర్ గా హిందూ విద్యార్ది

18 th Nov 2020, UTC

కశ్మీర్ సెంట్రల్ యూనివర్శిటీలో ఇస్లామిక్ అధ్యయనంలో మాస్టర్ కోర్సు కోసం నిర్వహించిన అఖిలభారత ప్రవేశపరీక్షల్లో హిందూ విద్యార్థి టాపర్ గా నిలిచారు.ఈ ప్రవేశపరీక్ష సెప్టెంబరు 20వతేదీన నిర్వహించగా దీనిలోరాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ నగరానికి చెందిన శుభం యాదవ్ అగ్రస్దానంలో నిలిచాడు. ముస్లిమేతరుడు అగ్రస్థానంలో నిలవడం ఇదే  మొదటిసారి అని ప్రొఫెసర్ హమీద్ నసీమ్ చెప్పారు. యాదవ్ ఢిల్లీలోని విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలోబీఏ చదివారని, అతను కళాశాలలో ఉన్నపుడు ఇస్లామిక్ అధ్యయనంపై ఆసక్తి పెంచుకున్నాడని ఆయన తెలిపారు.

శుభం యాదవ్ అరబ్ వసంతం, ఇరాన్ సమస్యలు, ఇస్లాం, ప్రవక్త ముహమ్మద్ గురించి వివిధ పుస్తకాలు చదివారు. భవిష్యత్‌లో ఇస్లాం గురించి మరింత తెలుసుకునేందుకు మాస్టర్ డిగ్రీ కోసం చేరానన్నారు. శుభం యాదవ్ భవిష్యత్తులో ఐఎఎస్ అధికారి కావాలని కోరుకుంటున్నారని, తన కలను సాకారం చేసుకునేందుకు ఇస్లామిక్ స్టడీస్ సహాయపడుతుందని ప్రొఫెసర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇస్లాంను రాడికల్ మతంగా చిత్రీకరించారు. దాని గురించి చాలా అపోహలున్నాయి. సమాజంలో విభజన పెరుగుతున్నందున, ఒకరి మతాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని శుభం యాదవ్ అన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox