Breaking News

తెలంగాణలో నేటినుంచి గ్రూప్‌-1, పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరణ

02 nd May 2022, UTC

Hyderabad: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నేటి  నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. గ్రూప్‌-1, పోలీసు, ఇతర యూనిఫాం ఉద్యోగాలకు నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పోలీసు ఉద్యోగాలకు ఈనెల 31 వరకు, గ్రూప్‌ వన్‌కు ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. గ్రూప్‌-1 కోసం రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఓటీఆర్​ తప్పనిసరిగా సవరించుకోవాలని టీఎస్​పీఎస్సీ స్పష్టం చేసింది.

నిరుద్యోగులు ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్న ఉద్యోగాల భర్తీ పర్వంలో ఇవాళ కీలక ఘట్టం ప్రారంభమైంది. గ్రూప్‌-1, పోలీసు, ఇతర విభాగాల యూనిఫాం పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 503 గ్రూప్‌ వన్‌ పోస్టుల కోసం ఈనెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్​పీఎస్సీ వెబ్‌సైట్‌లో లింక్‌ అందుబాటులో ఉంటుంది.

గ్రూప్‌ వన్‌కు అప్లై చేసే అభ్యర్థులు, రాష్ట్రపతి నూతన ఉత్తర్వులకు అనుగుణంగా ముందు ఓటీఆర్ సవరించుకోవాలి. టీఎస్​పీఎస్సీ వెబ్‌సైట్‌కు వెళ్లి ఓటీఆర్ ఐడీ, పుట్టిన తేదీ నమోదు చేస్తే, మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేస్తే దరఖాస్తు చేసేందుకు అవకాశం వస్తుంది. ఓటీఆర్ డేటా బేస్‌ ప్రకారం పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, కమ్యానిటీ తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. ఈ వివరాలు సరైనవని నిర్దారిస్తే కన్‌ఫమ్‌పై క్లిక్‌ చేయాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే నో ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox