Breaking News

భార‌త్ మ‌రో

07 th Sep 2020, UTC
భార‌త్ మ‌రో
 
న్యూఢిల్లీ :నూత‌న విద్యావిధానంలో ప్ర‌భుత్వాల  జోక్యం త‌క్కువ‌గా ఉండాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) పై  అన్ని రాష్ట్రాల గవర్నర్లు, విద్యాశాఖ మంత్రులు, వైస్‌ఛాన్సలర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మోదీ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 'దేశ ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డానికి ముఖ్య‌మైన ఆయుధం విద్య‌. గత కొన్ని సంవత్సరాలుగా మన విద్యా విధానంలో గొప్ప మార్పులేవీ చోటు చేసుకోలేదు. దాంతో దేశంలో ఆసక్తి, సృజనాత్మకతల స్థానంలో మూక మనస్తత్వం అభివృద్ధి చెందింది. కానీ ఎన్‌ఈపీ విధానంలో అధ్య‌య‌నం చేయ‌డానికి బ‌దులు నేర్చుకోవ‌డం, అభిరుచి, ప్రాక్టికాలిటీ అనే అంశాలుంటాయి. పాఠ్యాంశాల కంటే విమ‌ర్శ‌నాత్మ‌క ఆలోచ‌న‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.  21వ శతాబ్దపు అవసరాలకు అనువైనదిగా తీర్చిదిద్దడంపై ఈ విధానం ప్రధానంగా దృష్టి పెట్టింది.  ఎప్ప‌ట్నుంచో ఉండే స‌మ‌స్య‌ల‌ను  ప‌రిష్క‌రించి భార‌త్ మ‌రో  "జ్ఞాన ఆర్థిక వ్యవస్థ" గా మారడానికి ఈ కొత్త విద్యావిధానం ఎంతో సహాయపడుతుందని' మోదీ వివ‌రించారు.
 
ఎలాంటి గ‌జిబిజి లేకుండా విద్యార్థుల‌కు సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా విద్య‌ను బోధించాల‌ని, ప్రతి యూనివర్శిటీ, కాలేజీకి దశలవారీగా స్వయంప్రతిపత్తి క‌ల్పిస్తామ‌ని మోదీ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా  ఉత్తమ విద్యాసంస్థలకు రివార్డులు సైతం అంద‌జేస్తామ‌ని వివ‌రించారు. ఎన్‌ఈపీతో కొత్త ఆరోగ్యకర చర్చకు తెర లేచిందని, తద్వారా విద్యా విధానం మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు. ఎన్‌ఈపీని విజయవంతంగా అమలు చేయడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox