Breaking News

ఏపీ టెన్త్‌ విద్యార్థులకు తీపి కబురు రెండు సబ్జెక్టులకు బెటర్‌మెంట్

16 th Jun 2022, UTC

Andhrapradesh: పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ శుభవార్త తెలిపింది. ఎన్నడూ లేని విధంగా పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్ పరీక్షను రాసే అవకాశం కల్పించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల కోసం ఈ అవకాశాన్ని కల్పించారు. 50 కంటే తక్కువ మార్కులు వచ్చిన రెండు సబ్జెక్టులకు బెటర్ మెంట్ పరీక్ష రాసుకునే వీలు కల్పించారు. ఫెయిల్ విద్యార్థుల కోసం నిర్వహించే సప్లమెంటరీ పరీక్షలతో ఈ బెటర్ మెంట్ పరీక్షలను నిర్వహించనున్నారు.

సబ్జెక్ట్‌కు 500 రూపాయల చొప్పున రెండు సబ్జెక్ట్‌లకు 1000 రూపాయిల ఫీజుగా నిర్ణయించింది. కోవిడ్‌ నేపధ్యంలో బోధన సరిగా జరగకపోవడంతో ప్రభావం ఫలితాలపై కూడ కనిపించింది. దీనితో పదవ తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్‌ అవకాశమిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox