Breaking News

క్యాన్సల్ అయిన సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్...!

26 th Jun 2020, UTC
క్యాన్సల్ అయిన సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్...!
కరోనా మహమ్మారి ప్రభావం విద్యా సంస్థలపై గట్టిగానే పడుతోంది. కరోనా భారత్ లోకి ప్రవేశించగానే.. ముందు విద్యాసంస్థలనే రద్దు చేసారు.. విద్యార్ధులందర్నీ ఇంటికే పరిమితమవ్వాల్సింది గా సూచించారు. అయితే.. ఆన్ లైన్ క్లాసుల ద్వారా కొంతమేర పాఠాలు బోధించినప్పటికీ పరీక్షలు నిర్వహించడం మాత్రం వీలుపడలేదు.. ఈ కారణం గా ఇప్పటికే పలు ప్రభుత్వాలు పదవ  తరగతి పరిక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎపి లో కూడా  ఇంటర్ విద్యార్థులను.. సప్లిమెంటరీ విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తామని ప్రకటించారు. 
 
                   మొన్నటివరకు ఈ కరోనా మహమ్మారి బెడద తప్పకపోవడం తో సీబీఎస్‌ఈ కూడా పరీక్షలను రద్దు చేసే యోచనలో ఉంది. తాజాగా.. సీబీఎస్‌ఈ  కూడా పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కరోనా మహమ్మారి ప్రబలుతున్న కారణం గా  సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.  సీబీఎస్‌ఈ పరీక్షల విషయమై గురువారం సుప్రీమ్ కోర్ట్ లో విచారణ జరిగింది... అయితే.. ప్రభుత్వం తరఫున హాజరైన తుషార్‌‌ మెహతా పరీక్షలు రద్దు చేస్తున్నట్లు కోర్టు కు తెలిపారు. 
 
                  వాస్తవానికి ఈ పరీక్షలు జులై 1 నుంచి 15 వరకు  జరగాల్సింది.. కరోనా నేపధ్యం లో విద్యార్థులను ఇబ్బంది పెట్టరాదనే ఉద్దేశం లో ఈ పరీక్షలను రద్దు చేస్తున్నారు. వాటితో పాటు ఐసీఎస్‌ఈ పరీక్షలను కూడా క్యాన్సిల్‌ చేశామని అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు తో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఎగ్జామ్స్‌ నిర్వహించే పరిస్థితులు లేవని చెప్పాయని, పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత నిర్వహించాలని డిసైడ్‌ అయ్యామని అన్నారు.  
 
                    ఇది ఇలా ఉంటె.. మరో వైపు.. పన్నెండవ తరగతి విద్యార్థులకు మాత్రం ఛాయిస్ ఇచ్చారు.. పరీక్షలకు హాజరు కావాలనుకుంటున్నారా..? లేదా ఇంటర్నల్ మార్క్స్ ద్వారా ప్రమోట్ అవ్వాలనుకుంటున్నారా..? ఒకవేళ విద్యార్థులు పరీక్షలకు హాజరు కాదల్చుకుంటే.. వారు పరీక్షలు రాయవచ్చు..లేదనుకుంటే.. వారి ఇంటర్నల్ మార్క్స్ ఆధారం గా ప్రమోట్ చేయబడతారు. ఆ ఫలితాలను జులై 15న ప్రకటిస్తామని చెప్పారు. ఈ సీబీఎస్ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించి శుక్రవారం లోగా నోటిఫికేషన్‌ జారీ చేస్తామని తెలిపారు. ఒకవేళ ఆగష్టు లో రిజల్ట్స్ ను ప్రకటించేటట్లైయితే అపుడు.. సెప్టెంబర్ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని తెలిపారు. 
            
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox