Breaking News

ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే స్కూటీ, పెట్రోల్ కి కూడా డబ్బులు..

04 th Jan 2021, UTC

అస్సాం :ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు స్కూటీ, రోజు కాలేజీ కి వెళ్లి రావడానికి పెట్రోల్ కోసం వంద రూపాయల డబ్బులు కూడా ఇస్తారట. ఎక్కడా అని ఆశ్చర్యపోతున్నారా? అస్సాంలో. అస్సాం ఓ వినూత్న పధకానికి శ్రీకారం చుట్టింది. స్కూల్లో చదివే ఆడ పిల్లలకు ఆర్ధిక సాయం చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ పధకం కింద ప్రతి విద్యార్థినికి రోజుకు వంద రూపాయల చొప్పున అందించనుంది. 

ఇంటర్, అంతకంటే ఎక్కువ చదువుకోవాలనుకునే అమ్మాయిలకు రోజుకు మూడు వేల రూపాయలను చెల్లించనుంది. జనవరి నెల చివరిలో ఈ మొత్తాన్ని ప్రభుత్వమే విద్యార్థినుల ఖాతాలోకి పంపించనుంది. వాస్తవానికి ఈ పధకాన్ని గత నెలలోనే అమలు చేయాలనీ అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అమలు చేయలేకపోయామని అస్సాం ప్రభుత్వ అధికారులు తెలిపారు. 2019వ సంవత్సరం ఇంటర్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన ఆడ పిల్లలకు స్కూటీలను అందించనున్నారు. పెట్రోల్ కోసం రోజు వంద రూపాయలు ఇవ్వనున్నారు. ఇందుకుగాను అస్సోమ్ ప్రభుత్వం 144.30 కోట్లు రూపాయలను ఖర్చు చేస్తోంది. అస్సోమ్ లో మొత్తం 22,245 మంది ఆడపిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. ఆ రాష్ట్రము విద్యార్థినులను ఎక్కువ సంఖ్యలో ఎడ్యుకేషన్ వైపు రప్పించడానికి అస్సోమ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox