Breaking News

ఏపీ లో పరీక్షలు రద్దు..!

20 th Jun 2020, UTC
ఏపీ లో పరీక్షలు రద్దు..!
కరోనా మహమ్మారి కారణం గా ఇప్పటికే పలు రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలను రద్దు చేసాయి. తాజాగా.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా పదవ తరగతి పరీక్షల విషయమై  కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కొద్దీ సేపటి క్రితం ప్రకటించింది. తొలుత.. పరీక్షల విషయం లో జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాలని భావించింది.. అయితే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి వ్యాపిస్తూనే ఉండడం తో ఏకం గా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 
 
                ఇప్పటికే.. ఆంధ్ర ప్రదేశ్ లో మూడు సార్లు ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి.. ఎలెక్షన్ల నేపధ్యం లో ఒకసారి.. కరోనా నేపధ్యం లో రెండుసార్లు ఈ పరీక్షలను వాయిదా వేశారు. దాదాపు రెండున్నర నెలల కాలం పాటు దేశం లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ పరిస్థితుల్లోనే ఈ పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. అయితే.. ఇతర రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసినప్పటికీ తెలుగు రాష్ట్రాలు మాత్రం ఈ పరీక్షలు నిర్వహించాలని భావించాయి. అయితే.. తెలంగాణ లో కూడా పరీక్షలు అన్నిచోట్లా నిర్వహించడానికి హై కోర్ట్ అనుమతులు ఇవ్వకపోవడం తో వాటిని రద్దు చేస్తున్నల్టు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
                 పొరుగు రాష్ట్రమైన తెలంగాణ లో పరీక్షలు రద్దు చేయడం తో.. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పరీక్షలు రద్దు చేయాలనీ పలువురు డిమాండ్ చేసారు. మరో వైపు తల్లి తండ్రులు కూడా ఈ కరోనా కాలం లో పిల్లలను జన సందోహాలలోకి పంపడానికి భయపడుతున్న తరుణం లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox