Breaking News

అక్షరాస్యతలో అట్టడుగున ఆంధ్రప్రదేశ్

08 th Sep 2020, UTC
అక్షరాస్యతలో అట్టడుగున ఆంధ్రప్రదేశ్
 
ఆంధ్రప్రదేశ్ :ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రా, అక్షరాస్యతలో మాత్రం అట్టడుగున నిలిచింది. 66.4 శాతం అక్షరాస్యతతో ఏపీ దేశంలోనే చివరి స్థానంలో ఉంది. ఈ విషయంలో బిహార్ (70.9 శాతం) ఆంధ్రా కంటే మెరుగ్గా ఉండటం గమనార్హం.
 
జాతీయ అక్షరాస్యత రేటు 77.7 శాతంగా ఉండగా, తెలంగాణ అక్షరాస్యత రేటు 72.8 శాతంగా ఉంది. అసోం (85.9 శాతం) కంటే తెలంగాణ వెనుకంజలో ఉండటం వాస్తవికతకు అద్దం పడుతోంది. మన పొరుగున ఉన్న కర్ణాటక అక్షరాస్యత రేటు 77.2 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో ఉత్తరాఖండ్ అక్షరాస్యత రేటు 87.6 శాతంగా ఉండటం విశేషం. 2017-18కి గానూ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిలీజ్ చేసిన ఎడ్యుకేషన్ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అక్షరాస్యతలో కేరళ 96.2 శాతంతో తొలిస్థానంలో ఉండగా ఢిల్లీ రెండోస్థానంలో ఉంది.
 
మన దేశంలో అక్షరాస్యత విషయంలో లింగ బేధం ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 84.7 శాతం ఉండగా, మహిళల్లో 70.3 శాతంగా ఉంది. ఏపీలో స్త్రీ, పురుషుల మధ్య అక్షరాస్యత రేటులో అంతరం 13.9 శాతంగా ఉంది. అంటే ఆంధ్రాలో పురుషుల్లోనూ నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. స్త్రీ, పురుషుల మధ్య అక్షరాస్యత రేటులో అంతరం రాజస్థాన్‌‌లో 23.2 శాతం కాగా, బిహార్‌లో 19.2 శాతం, యూపీలో 18.4 శాతంగా ఉంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox