Breaking News

తెలంగాణలో అన్ని విద్యాసంస్దలు బంద్ 

23 rd Mar 2021, UTC
తెలంగాణలో అన్ని విద్యాసంస్దలు బంద్ 

తెలంగాణలో విద్యాసంస్థలు, హాస్టళ్లలో కరోనా కేసులు పదులు సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలోబుధవారం నుంచి విద్యాసంస్థలను మూసివేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. మన రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారని, దీనిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని మంత్రి అన్నారు. అందుకే విద్యాసంస్థల మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

విద్యా సంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి. కాబట్టి కరోనా విస్ఫోటకంగా మారే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితులను పూర్తిగా సమీక్షించిన మీదట విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ బుధవారం (మార్చి 24)నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి, రాష్ర్టంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయి. విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్ లైన్ శిక్షణా తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. రాష్ట్ర ప్రజానీకం అందరూ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

అంతకుముందు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాలల విషయం పై మంత్రి, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున వాటిని కొద్ది కాలం మూసివేసేలా అధికారులు, సీఎం అభిప్రాయపడ్డారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా సెలవులు ఇవ్వాలని సూచించారు.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox