Breaking News

ఏపీ లో ఇంగ్లీష్ మీడియం... విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌

31 st Jul 2020, UTC

ఆంధ్రప్రదేశ్ : ఏపీలో ఇంగ్లీషు మీడియం స్కూళ్లకే కట్టుబడి ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాలను పరిగణనలోనికి తీసుకొనే తాము విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. 97శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం కావాలన్నారన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు గ్రామం నుంచి కూడా ఇంగ్లీషు మీడియం కావాలని తీర్మానం చేశారన్నారు.
 
జాతీయ విద్యా విధానం ప్రకారం తెలుగు భాష ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో కూడా రావాల్సి ఉంది. ప్రజలను తప్పుదోవ పట్టించరాదు. నూతన పాలసీని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ నిర్ణయాన్ని నిలువరించాలనుకుంటే ఎలా?’ అని ప్రశ్నించారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, అందుకే ఇంతకు మించి మాట్లాడలేకపోతున్నానని అన్నారు.
 
కేంద్రం విడుదల చేసిన జాతీయ విద్యా విధాన ముసాయిదాలో అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించామన్నారు మంత్రి. అవకాశం ఉన్నంత వరకు మాతృభాష స్వదేశీ, స్థానిక భాషల్లో విద్యాబోధన చేయాలని ముసాయిదాలో ఉందన్నారు. మాతృభాషలో బోధిస్తే పిల్లలు సులువుగా తొందరగా నేర్చుకుంటారని ఉందని,అంతేగానీ తప్పనిసరి అని చెప్పలేదన్నారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు తెలుగు, ఆంగ్లమాధ్యమంలో పాఠ్యపుస్తకాలను ఇప్పటికే ప్రచురించామన్నారు మంత్రి. ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, కేసును కొనసాగిస్తామన్నారు.
 
జాతీయ విద్యా విధానంలోని చాలా అంశాలను తాము ఇప్పటికే అమలు చేశామన్నారు మంత్రి. ముందుగా రాష్ట్రంలోనే మానవ వనరులశాఖను విద్యాశాఖగా పేరు మార్చామని,ఇప్పుడు కేంద్రంలోనూ మార్చారన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీప్రైమరీ స్కూళ్లుగా మార్చాలని,6-8తరగతులకుడిజిటల్‌ ఎడ్యుకేషన్‌, కోడింగ్‌, కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించాలని తొలుత తాము నిర్ణయించామని,అదే ఇప్పుడు కేంద్రం చెబుతోందన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox