Breaking News

ఇకపై డిగ్రీ నాలుగేళ్ల కోర్సు... విద్యాశాఖగా మానవ వనరుల శాఖ

30 th Jul 2020, UTC

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో మార్పులకు  శ్రీకారం చుట్టిన కేంద్రం అందులో భాగంగా మానవ వనరుల శాఖ పేరును విద్యా శాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.  బుధవారం కేంద్రమంత్రి వర్గం  నూతన జాతీయ విద్యా విధానానికి  ఆమోదం తెలిపింది. నూతన విద్యా విధానంలో భాగంగా మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు విద్య ను కేంద్రం తప్పనిసరి చేసింది. విద్యార్థులపై కరికులమ్‌ భారం తగ్గించాలనేది నూతన విధానం ఉద్దేశమని స్పష్టం చేసింది. 
 
2030 నాటికి అందరీకి విద్య అందించాలనేది తమ లక్ష్యమని పేర్కొంది. బహుభాషల బోధన దిశగా నూతన విద్యా విధానం ఉండనున్నట్టు తెలిపింది.
అలాగే ప్రస్తుతం ఉన్న విధానంలో కేంద్రం భారీ మార్పులు తీసుకువచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ప్రకారం..ప్రస్తుతం ఉన్న 10+2+3(పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ) విధానాన్ని 5+3+3+4 మర్చారు. 
 
ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్‌ అమలు చేయనున్నారు. కొత్త విధానంలో ఇంటర్‌ విద్యను రద్దు చేసి.. డిగ్రీ విద్యను నాలుగేళ్లుగా మార్పు చేశారు. ఆరో తరగతి నుంచే విద్యార్థులకు కోడింగ్‌, ప్రోగామింగ్‌ కరికులమ్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆరో తరగతి నుంచే వొకేషన్‌ కోర్సులను తీసుకురానున్నారు. విద్యార్థులపై పాఠ్యాంశాల భారం తగ్గించి కాన్సెప్ట్‌ నేర్పే ప్రయత్నం చేయనున్నారు.
 
ప్రస్తుతం ఉన్న జాతీయ విద్యా విధానాన్ని 1986లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1992లో దాన్ని సవరించారు.  బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో దేశంలో నూతన విద్యా విధానం తీసుకురానున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox