Breaking News

పదవ తరగతి కి క్లాస్ లు షురూ...మిగిలిన వారికీ షిఫ్టులు..!

02 nd Jun 2020, UTC
పదవ తరగతి కి క్లాస్ లు షురూ...మిగిలిన వారికీ షిఫ్టులు..!
కరోనా మహమ్మారి కారణం గా ఇప్పటివరకు అన్ని పాఠశాలలు మూత పడ్డ సంగతి తెలిసిందే. అయితే.. తిరిగి అన్ని తెరుచుకుంటున్న ఈ తరుణం లో.. స్కూళ్ల విషయం లో వచ్చే విద్యా సంవత్సరం (2020-21)లో తరగతులు ఎలా ఉండాలనే విషయంపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆలోచనలు చేస్తోంది. అయితే.. పదవ తరగతి విద్యార్థులకు మాత్రం గతం లో లానే ఆరు రోజుల పాటు పాఠశాల నడపాలని భావిస్తోంది. అలా లేకపోతె...పాఠ్యాంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం కష్టమని విద్యాశాఖ భావిస్తోంది. మిగిలిన తరగతుల వారికి షిఫ్టు విధానం అమలు చేసినా సమస్య ఉండకపోవచ్చు అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
        జూన్‌ 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధం అవుతోంది. కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లోని విద్యార్థులు ఎలా పరీక్షా కేంద్రాలకు వస్తారన్న సమస్యపై అధికారుల్లో చర్చ సాగుతోంది. ఒకవేళ ఆ ప్రాంతాల్లో ఎక్కువ విద్యార్థులు ఉంటె.. అక్కడే ఓ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలనీ భావిస్తున్నారు. అయితే... అపుడు కూడా ప్రశ్న పత్రం తీసుకురావడం ఎలా అన్న సమస్య మొదలవుతోంది.. ఈ విషయమై విద్యాశాఖ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox