Breaking News

వారికోసం మరోసారి నీట్

12 th Oct 2020, UTC
వారికోసం మరోసారి నీట్

న్యూఢిల్లీ :సెప్టెంబర్‌ 13 న జరిగిన నీట్‌ పరీక్షా ఫలితాలు షెడ్యూల్‌ ప్రకారం సోమవారం విడుదల కావాల్సి ఉండగా సుప్రీం కోర్టు ఆదేశాలతో ఫలితాలు ఆలస్యం కానున్నాయి. కరోనా నియంత్రణ చర్యలతో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు అక్టోబర్‌ 14న ఎగ్జామ్‌ నిర్వహించాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో చిక్కుకుపోయిన విద్యార్థులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈమేరకు ఫలితాల విడుదల వాయిదా పడింది. అక్టోబర్‌ 16 న ఫలితాలు విడుదల చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన నీట్‌ పరీక్షా నిర్వహణ ఎట్టకేలకు సెప్టెంబర్‌ 13 న జరిగింది. అయితే, దేశవ్యాప్తంగా 15 లక్షల మంది పరీక్ష కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 90 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox