Breaking News

ఇంగ్లీష్ మీడియం కావాలంటే తెలుగు వద్దనా...?

07 th Oct 2020, UTC

ఆంధ్ర ప్రదేశ్:  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం లో నే పాఠ్యాంశాలు బోధించాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన చేయడం ద్వారా విద్యార్థులు పై తరగతులకు వచ్చిన తరువాత సులువుగా పాఠాలు అర్ధం చేసుకోగలుగుతారని.. జీవితం లో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని.. ప్రపంచం తో పోటీ పడగలుగుతారని.. అందుకే వైసీపీ ప్రభుత్వం విద్యావిధానం లో ఈ సంస్కరణలను తీసుకొస్తోంది అని వైసీపీ వర్గాలు సమర్ధించుకుంటున్న సంగతి విదితమే.. అయితే.. ఈ విషయం లో ప్రతిపక్షాలకు.. అధికారపక్షానికి ఏకాభిప్రాయం కుదరకపోవడం తో.. ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు వచ్చి.. ఈ విషయం హై కోర్ట్ వరకు వెళ్ళింది.. అయితే.. హై కోర్ట్ జడ్జి జస్టిస్ బాబ్డే కూడా విపక్షాల వాదనను సమర్ధించారు.. ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు మీడియం లో కూడా బోధనా తప్పనిసరిగా జరగాల్సిందేనని వ్యాఖ్యానించారు. కాగా.. ఆయన ఈ విషయమై రేపు తీర్పు వెలువడించాల్సి ఉంది.. ఎక్కువ మంది కోరారని.. పూర్తి గా ఒక మీడియం లోనే విద్యా బోధనా చేయడం సరికాదని ఆయన తన వ్యాఖ్యల్లో వెల్లడించారు..

మరో వైపు.. బీజేపీ తో సహా.. విపక్షాలు ఈ వాదనని సమర్ధిస్తున్నాయి.. ఇంగ్లీష్ మీడియం ను వద్దని చెప్పడం లేదని.. ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు మీడియం కూడా తప్పనిసరిగా ఉండాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మాతృ భాష లో చదివితే.. విద్యార్థులకు సులువుగా అర్ధం అవుతుందని.. మాతృ భాషా ద్వారానే.. ఇతర భాషలను సులువు గా నేర్చుకోగలుగుతారని వాదిస్తున్నారు.. పునాది గట్టి గా ఉంటేనే.. భవనం నిలబడుతుందని.. ఎవరికైనా మాతృభాష పై పట్టు ఉంటేనే అన్యభాషలు నేర్చుకోవడం సులువవుతుంది అని పేర్కొన్నారు. చిన్న తరగతుల వరకు మాతృ భాష లో విద్యాబోధన చేసి.. పై తరగతులకు వచ్చిన తరువాత ఆంగ్లం లో నేర్పిస్తే.. వారు రెండు భాషలపైనా పట్టు సాధిస్తారన్నారు. ఈ విషయం లో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.. మన తెలుగు భాష కు ఉన్న ప్రాధాన్యత తెలిసి.. దానిని పక్కన పెట్టడం సరికాదన్నారు.. రాష్ట్ర సంస్కృతి ని పక్కన పెట్టడం సరికాదని భావిస్తున్నారు. మరిన్ని ఆంధ్ర ప్రదేశ్ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox