Breaking News

కేంద్రం కొత్త విద్యా విధానంలో మాతృభాషలో బోధనను తప్పనిసరి చేసిందా?

30 th Jul 2020, UTC

న్యూఢిల్లీ‌ : ఇంగ్లిషు మాధ్యంలో బోధించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు కాబోదంటూ పత్రికల్లో వచ్చిన వార్తలు నిజమేనా? ఒక్కసారి క్షుణ్నంగా తెలుసుకోండి.

        జాతీయ విద్యా విధానం అన్నది మార్గదర్శక సూత్రాలు కలిగిన డాక్యుమెంట్‌ కేంద్రం విడుదల చేసే ఈ మార్గదర్శకాలను ప్రతి రాష్ట్రానికీ అన్వయించే పరిస్థితులు, పాటించే పరిస్థితులు ఉంటే పాటించవచ్చు. అయితేరాష్ట్రాల పరిస్థితులు మేరకు, వారి వారి ఆకాంక్షల ప్రకారం దీన్ని పాటించవచ్చు.

             విద్య అన్నది కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్నందున కొత్త విద్యావిధానం అమలు కావాలంటే రాష్ట్రాల తోడ్పాటు కూడా అవసరమని కేంద్రం స్పష్టంగా చెప్పింది. అందువల్ల ఎవ్వరిమీద కూడా బలవంతంగా రుద్దజాలమని కేంద్రం స్పష్టం చేసింది.ఈ విద్యావిధానం లో కేంద్రం ఇచ్చిన సూత్రాలు రాష్ట్రాలు కచ్చితం గా అమలుచేయాలనేమి లేదు.

           కొత్త విద్యావిధానంలో ఇచ్చిన సూచనలు అన్నీకూడా విద్యార్థుల అభీష్టాలమీద ఆధారపడి ఉంటుంది. విద్యార్థులు తమకు నచ్చిన మాధ్యమం లో చదువుకోవచ్చు. ఈ మార్గదర్శకాలు సాధ్యాసాధ్యాలమీద, విద్యార్థుల అభీష్టము, రాష్ట్ర ప్రభుత్వం పాలసీలమీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే విద్య అన్న అఃశం ఉమ్మడి జాబితాలో ఉంది. మొదటి సారిగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మాతృభాషా మాధ్యమం తప్పనిసరిగా  ఉండాలన్న సూచన చేశారు. మొదటి సారిగా ప్రైవేటు స్కూళ్లలోనూ వర్తింపు చేయాలన్నది నూతన విద్యావిధానంలో ఒక సూచన.

        కాని ప్రైవేటు స్కూల్లో తెలుగు మీడియం కూడా పెట్టాలని ఇటీవల ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేస్తే దాన్ని డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల హక్కులకు భంగం కలిగించలేమని చెప్పింది. దీని అర్థం ఏంటంటే.కొత్త విద్యావిధానం అన్నది సాధ్యాసాధ్యాలమీద ఆధారపడి ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్ళు నడిపే యాజమాన్యాలు తమ అభీష్టం మేరకు,తమకు అందుబాటులో ఉన్న సిబ్బంది మేరకు నడిపిస్తారు. బలవంతంగా వారు తెలుగు మీడియం ను నడపాలనే వాదన సరైనది కాదు. కొత్త విద్యావిధానం అన్నది దిశానిర్దేశం కాదు.  దిశామార్గదర్శకం మాత్రమే. విద్యార్థులపై ప్రత్యేకంగా ఒక మీడియంలోనే బోధించలేం. విద్యార్థుల ఇష్టాఇష్టాలమీద ఆధారపడి ఉంటుంది అని నూతన విద్యావిధానం లో కేంద్రం స్పష్టం చేసింది. క్షుణ్నంగా నూతన విద్యావిధానాన్ని చదివితే ఇది అర్థం అవుతుంది.

మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox