Breaking News

నూతన విద్యావిధానం లో...చైనీస్ భాష ఔట్..!

01 st Aug 2020, UTC

న్యూఢిల్లీ : భారత్ లో విద్యావిధానాన్ని సవరించారు. రెండు రోజుల కిందట నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం  తెలిపింది. అయితే ఈ ఏడాది విడుదల చేసిన ముసాయిదా లో విదేశీ భాషల విషయం లో చైనీస్ భాష ను పేర్కొనలేదు. గతేడాది విడుదల చేసిన ముసాయిదాలో మాత్రం చైనీస్ భాష మాండరిన్ ను కూడా పొందుపరిచారు. త్రి-భాషా సూత్రం స్థానంలో  ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, చైనీస్, జపాన్, జర్మన్‌లను విదేశీ భాషలుగా పేర్కొంది.  అయితే తాజాగా సవరించిన మార్పుల్లో వీటి నుంచి చైనీస్ భాష మాండరిన్ ను తొలగించింది.

             ప్రపంచ జ్ఞానం, చైతన్యాన్ని వృద్ధి చెందించుకోవడానికి ఇతర భాషలైన కొరియన్, జపనీస్, థాయ్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్ భాషలను కూడా చేర్చారు. అయితే ఈ మార్పు గురించి కొత్తగా కారణాలు వెతకాల్సిన పని లేదు. ఇప్పటికే పలు చైనీస్ ఆప్ లను భారత ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే బెంగళూరు లో 2017 నుంచే విద్యార్థులు చైనా భాష పై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారట. చైనా భాష అనేక ఆసియా భాషలను అధిగమించడానికి సిద్ధంగా ఉందని విదేశీ భాషా ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే2020 సంవత్సరానికి గాను చైనా భాష కోసం ఎవరు పేర్లు నమోదు చేసుకోలేదని తెలిపారు.

              పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు వివిధ భాషలను నేర్చుకోవాలనే ఉద్ధేశ్యంతో త్రీ-భాషా సూత్రాన్ని తీసుకొచ్చారు. ఈ సూత్రాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తరువాత 1968 జాతీయ విధాన స్పష్టత అమలులోకి తీసుకొచ్చారు. ఈ విధానం ప్రకారం అన్ని రాష్ట్రాలలోను మూడు భాషల సూత్రాన్ని అమలు చేయాలి. హిందీ మాట్లాడే రాష్ట్రాలలో హిందీ, ఆంగ్లం, ఆధునిక భారతీయ భాష (ప్రాధాన్యంగా దక్షిణ భారత భాష ను, అలానేహిందీయేతర రాష్ట్రాలలో హిందీ, ఆంగ్లం, ఏదైనా ప్రాంతీయ భాష ఉండాలని అప్పట్లో నిర్ణయించారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox