Site icon Prime9

Tulasi: తులసిని పూజిస్తే కష్టాలు దూరం..

Tulasi: హిందువులు తులసి మొక్కను ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో శ్రేష్టమైనదిగా భావిస్తారు. అందుకే ప్రతి ఒక్క ఇంటి ఆవరణలో మనకు తులసి మొక్క దర్శనమిస్తుంది.అయితే తులసి మొక్కను నాటే విషయం దగ్గర నుంచి పూజించే వరకు ప్రతి ఒక్క విషయంలోని ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. తులసి మొక్కను సరైన దిశలో నాటిపూజించడం వల్ల ఎన్నో రకాల వాస్తు దోషాలు తొలగిపోవడమే కాకుండా మనం చేపట్టే పనులలో విజయాలను కూడా అందుకుంటాము.

తులసి మొక్కను ఎల్లప్పుడూ కూడా దక్షిణ దిశలో నాటకూడదు. ఈ దిశ పూర్వికుల దిశ కనుక తులసి మొక్కను దక్షిణ దిశలో కాకుండా ఉత్తర లేదా ఈశాన్య దిశలో నాటడం ఎంతో మంచిది. తులసి మొక్కను దక్షిణ దిశలో నాటడం వల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక తులసి మొక్క చుట్టూ ఎలాంటి చెత్తాచెదారం లేకుండా తులసి కోట దగ్గర చెప్పులు వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే తులసి మొక్కను పూజించే సమయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి.

తులసి మొక్కకు ఉదయం సాయంత్రం పూజ చేయడం ఎంతో మంచిది. సాయంత్రం తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. సాయంత్ర సమయంలో తులసి చెట్టు కింద లక్ష్మీనారాయణలు సేద తీరుతుంటారని అందుకే తులసికి సాయంత్రం నీళ్లు పోయకూడదని చెబుతుంటారు. అదేవిధంగా తులసిని ఏకాదశి, ఆదివారం, చంద్ర, సూర్యగ్రహణం రోజులలో కూడా తాకరాదు. ఆదివారం రోజున తులసి మొక్కకు నీళ్లు పోయకూడదని చెబుతారు. ఇక తులసి మొక్కను స్నానం చేయకుండా అపరిశుభ్రమైన చేతులతో తాకటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేసి మనకు ఆర్థిక కష్టాలను కలిగిస్తుంది. కనుక తులసి పూజ చేసేటప్పుడు ఈ నియమాలను పాటించడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే మనం చేసే పనులలో విజయం కలుగుతుంది.

Exit mobile version