Site icon Prime9

Worshipping God: ఏరోజు ఏదేవుడిని ఎలా పూజించాలి?

spiritual: మనలో చాలామందికి దేవుని మీద భక్తి వుంటుంది. ఒక్కక్కరికి ఒకో దేవుడంటే నమ్మకం వుంటుంది. అయితే తెలియని విషయమేమిటంటే ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి. ఎలా పూజించాలనేదానిపై చాలామందికి క్లారిటీ వుండదు. అటువంటి వారందరూ ఈ కింద చెప్పిన సూచనలు పాటించాలి.

ఆదివారం..
సూర్యభగవానుడిని ఎర్రటిపూలతో పూజించాలి.ఆదిత్యహృదయం చదివితే చాలా మంచింది.

సోమవారం..
శివుడిని మారేడుదళాలు, తెల్లనిపూలతో పూజించాలి. శివుడు అభిషేక ప్రియుడు. కాబట్టి నీళ్లతో అభిషేకించినా సంతృప్తి చెందుతాడు.

మంగళవారం..
ఆంజనేయునికి ఇష్టమైన రోజు. ఈ రోజు స్వామివారికి తమలపాకులతో పూజచేయాలి. అదేవిధంగా ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామి వారిని ఎర్రటిపూలతో పూజిస్తే ఇబ్బందులు తొలగుతాయి.

బుధవారం..
వినాయకుడిని గరిక, తెల్లజిల్లేడు, ఎర్రిగన్నేరు పూలతోపూజిస్తే చేపట్టిన కార్యక్రమాల్లో విఘ్నాలు తొలగుతాయి.

గురువారం
శ్రీరాముడు, లక్మీనరసింహస్వామిని పసుపుపూలతో పూజించాలి. అదేవిధంగా ఈ రోజు సాయిబాబానికూడ భక్తిశ్రద్దలతో పూజించాలి

శుక్రవారం..
శుక్రవారం దుర్గాదేవిని ఎర్రనిమందారపూలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది

శనివారం..
వేంకటేశ్వరస్వామివారికి ఇష్టమైన రోజు. తులసిమాల, నీలంరంగు పూలతో పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా  మంచిది.

భక్తులు తమ ఇష్టదైవాలను ఆయా రోజుల్లో పేర్కొన్న విధంగా పూజలు చేస్తూ పేదలు, వికలాంగులకు తమకు తోచినంత మేరకు సాయం చేస్తే మంచి ఫలితాలను పొందుతారు.

Exit mobile version