Hanuman Puja: మంగళవారం హనుమంతుడిని కొలిస్తే సర్వ శుభాలు

రాముని స్మరిస్తే కేవలం కైవల్యం మాత్రం దొరుకుతుంది. ఈలోగా జరగవలసిన ఐహికకర్మలలో కష్టాలు ఎదురైతే, రామసేవకుడయిన నన్ను తలవండి, మీకు సాయపడతానని హనుమంతుడు అభయమిచ్చాడు. రామబంటు అయిన హనుమంతుడిని మంగళవారం ప్రార్థించిన సకల జ్ఞానం లభించి, ఆ రోజు తలచిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి.

  • Written By:
  • Updated On - July 12, 2022 / 04:53 PM IST

Hanuman Puja: నైవ యోజ్యోరామ మంత్ర: కేవలం మోక్షసాధకః
ఐహికే నమను ప్రాప్తే మాం స్మరేత్ రామసేవకం

రాముని స్మరిస్తే కేవలం కైవల్యం మాత్రం దొరుకుతుంది. ఈలోగా జరగవలసిన ఐహికకర్మలలో కష్టాలు ఎదురైతే, రామసేవకుడయిన నన్ను తలవండి, మీకు సాయపడతానని హనుమంతుడు అభయమిచ్చాడు. రామబంటు అయిన హనుమంతుడిని మంగళవారం ప్రార్థించిన సకల జ్ఞానం లభించి, ఆ రోజు తలచిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. ఇంట్లో ఎవరైనా జబ్బులతో బాధపడితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజిస్తే వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయి. మంగళవారం నాడు నుదుటన సింధూరం ధరించి హనుమంతుడిని పూజిస్తే శుభప్రదంగా వుంటుంది

మంగళవారం హనుమాన్ చాలీసా 11 మార్లు తగ్గకుండా పారాయణ చేయడం సుందర కాండ పారాయణ తో సమానం. ఇక 40 రోజులు హనుమాన్ చాలీసాని రోజుకి 11 మార్లు చొప్పున పారాయణ చేస్తే ఎటువంటి పనులైనా జారుతాయి. హనుమంతుడికి ప్రతి ఉదయం 11 ప్రదక్షిణలు చేయడంవలన సర్వ దోషాలు నశించి శుభం కలుగుతుంది. అంతేకాదు శ్రీరాముడికి పరమభకుడైన హనుమంతుడి కరుణా కటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి, భజన చేస్తే ఆ ప్రదేశానికి హనుమ ఎదో ఒక అవతారంలో వస్తాడని పెద్దల నమ్మకం.

ఇక మంగళవారం హనుమంతుడి పూజ చేసే భక్తులు ఆ రోజు మాంసాహారం పొరపాటున కూడా తినకూడదు. అలాగే మద్యం సేవించకూడదు. ఆ రోజు నిగ్రహంతో దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. అలాగే మనస్సులో జై శ్రీరాం అంటూ తలచుకోవాలి. స్త్రీలు, పిల్లలు, పెద్దలపై దుర్భాషలు ఆడరాదు. ఇలా దైవ చింతనతో హనుమంతుడిని ఆరాధిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి.