Site icon Prime9

Weekly Horoscope: వార ఫలాలు (జూలై 10- జూలై 16)

Daily Horoscope

Daily Horoscope

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి  ఉంటుంది. .సహోద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది.  వివాదాలకు దూరంగా వుండాలి.ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఏవిషయమైనా కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) .

ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు వున్నాయి. . వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌వారికి బాగుంటుంది. మనోబలంతో ముందడుగు వేస్తే మంచి ఫలితాలు వున్నాయి. ఆర్దికలావాదేవీలపట్ల జాగ్రత్త వహించాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగవ్యాపారాల్లో ఒత్తిడి వున్నప్పటికీ ఫలితాలు అనుకూలంగా వుంటాయి. శుభ వార్తలు వింటారు. కొందరు వ్యక్తుల నుంచి సహాయనిరాకరణ వుండే అవకాశముంది. వివాదాలకు దూరంగా వుండాలి . ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి వుంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికం, ఫలితం స్వల్పం అన్నట్టుగా ఉంటుంది. . విద్యార్థులు బాగా శ్రమ పడితే ఫలితం వుంటుంది వ్యాపారస్తులకు సమయం అనుకూలంగా ఉంది.  చాలకాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తయే అవకాశముంది..

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగవ్యాపారాలు అనుకూలంగా వుంటాయి. శుభవార్తలు వింటారు.  ఆదాయం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్దిక విషయాల్లో అప్రమత్తంగా వుండాలి. అపరిచితులను నమ్మవద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఈ వారం ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలఫలితాలు వుంటాయి.  శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి మంచి సహాయం అందుతుంది.  ఆకస్మిక ధనలాభం వుంది. స్నేహితులతో విందువినోదాల్లో పాల్గొంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఈ వారం మిశ్రమఫలితాలు వున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. మిమ్మల్ని ఇబ్బందిపెట్టేవారుంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) . వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు అవకాశం ఉంది. . ఎవరితోనూ వాదనలు దిగవద్దు. మీకు రావలసిన బకాయిలు అందుతాయి.  కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలను పొందుతారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) . ఉద్యోగంలో బాధ్యతలు పెరుగతాయి. ఆర్దికవిషయాల్లో అప్రమత్తంగా వుండాలి. ఏ విషయమైనా ఒకటికి రెండుసార్లుఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూల సమయం.  వివాదాలకు దూరంగా వుండాలి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం 4, ధనిష్ట 2) వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు వుంటాయి . ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనోబలంతో ముందుకు  సాగాలి. నిరుద్యోగులు  గట్టిగా కష్టపడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశమంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం 4, పూర్వాభాద్ర 1,2,3) ఈ వారం అనుకూల ఫలితాలు వుంటాయి.  వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది.  ఒక శుభవార్త వింటారు. ఆర్దికవిషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)   ఉద్యోగంలో పై అధికారులనుంచి ప్రోత్సాహం వుంటుంది. వ్యాపారులకు గతంలో కన్నా మెరుగ్గా వుంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.  ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి.

Exit mobile version